ANDRAPRADESH: 2019 ఎన్నికల్లో కాపు నాయకుడే అయినా.. పవన్ కల్యాణ్‌కు ఎదురు దెబ్బ తగిలింది. రెండు స్థానాల్లో ఆయన పోటీ చేస్తే.. రెండు చోట్లా ఓడిపోయారు. కాపులు కీలకమైన రాజకీయ భాగస్వామ్యం ఉన్న ఓటర్లు. ఎవరు ఔనన్నా.. కాదన్నా.. వారి ఓటు బ్యాంకు కీలకం. అన్ని రాజకీయ పక్షాలకు కూడా.. సుమారు 50 నియోజకవర్గాల్లో కాపు సామాజిక వర్గానికి చెందిన అనేక ఉప కులాల ఓట్లు అత్యంత అవసరం. వీరిలో కాపులు, శెట్టి బలిజ, ఒంటరి, తెలగ, బలిజ ఇలా.. అనేక వర్గాలు ఉన్నాయి. అయితే.. 2019 వరకు వీరు ఎవరికి వారుగా ఉన్నారు.
వీరిలో పెద్దగాఐక్యత కూడా కనిపించలేదు. అందుకే.. 2019 ఎన్నికల్లో కాపు నాయకుడే అయినా.. పవన్ కల్యాణ్‌కు ఎదురు దెబ్బ తగిలింది. రెండు స్థానాల్లో ఆయన పోటీ చేస్తే.. రెండు చోట్లా ఓడిపోయారు. 148 స్థానాల్లో నాయకులను పోటీ పెడితే.. కేవలం ఒకే ఒక్కస్థానంలో అది కూడా ఎస్సీ సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న చోట మాత్రమే విజయం దక్కించు కున్నారు. ఈ పరిణామాల దరిమిలా.. 2024 నాటికి కాపులను ఏకం చేయడంలో పవన్ సక్సెస్ అయ్యారు. పైకి ఆయన నేరుగా కుల కార్డు వినియోగించలేదు.
కానీ, అంతర్గతంగా మాత్రం ఆయన చేసిన వ్యాఖ్యలు, కట్టుబాటుపై చేసిన కామెంట్లు వంటివి ఫలించారు. నన్ను గెలిపించండి.. అన్నా, మనంలో మనకు ఐక్యత లేకపోతే ఎలా? అంటూ ప్రశ్నించినా.. కాపులను, దీనికి అనుబంధంగా ఉన్న సామాజిక వర్గాలను ఆయన ఏకం చేశారనే చెప్పాలి. ఇది.. 2024లో కలిసి వచ్చింది. తద్వారానే ఐక్యంగా ముందుకు నడిచేలా చేసింది.. జనసేనకు 100 శాతం స్ట్రయిక్ రేటు వచ్చేలా కూడా చేసింది.
కట్ చేస్తే.. ఏడాది పాలన పూర్తయ్యాక.. ఈ ఐక్యత ఉందా? అనేది ఇప్పుడు చర్చకు వస్తున్న అంశం. కాపుల్లోనూ ఇతర మతాలను తీసుకున్నవారు.. ఇతర దేవుళ్లను ఆరాధించేవారు ఉన్నారు. ఈ క్రమంలో పవన్ తీసుకున్న సనాతన ధర్మం లైన్ పై వారిలో ఒకింత బేధాభిప్రాయం ఉంది. అదేవిధంగా తాము ఆశించిన రిజర్వేషన్ ఫలాల విషయంపై ఇప్పటి వరకు తేల్చ లేక పోయారు. ఈ రెండు అంశాలకు తోడు.. స్థానికంగా కూడా.. కాపులకు ఎలాంటిప్రత్యేక మేళ్లు చేయలేదు. దీంతో ఈ ఐక్యత ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారిందనేది విశ్లేషకులు చెబుతున్న మాట.
Social Plugin