Ticker

6/recent/ticker-posts

గోకుల పారిజాత గిరిపై వర్మ మూవీస్ నూతన చిత్రం పూజా కార్యక్రమాలు..


చీఫ్ గెస్ట్ గా విచ్చేసిన జెడ్ పి టిసి పోల్నా టి బాబ్జి..

జంగారెడ్డిగూడెం: శ్రీ వర్మ మూవీ క్రియేషన్స్ ప్రొడక్షన్ నెంబర్. 2.. నూతన చిత్రం పూజా కార్యక్రమం సోమవారం జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరి పై జరిగింది. ఉదయం 10.10 గంటలకు ముఖ్య అతిధి పోల్నాటి బాబ్జి జ్యోతి ప్రజ్వలన చేసి అనన్య చిత్రం మాదిరిగానే నూతన సినిమా విజవంతం కావాలని శుభాకాంక్షలు తెలిపారు.

డైరెక్టర్ బీ. ప్రసాద్ రాజు స్వాగతం పలికి కొత్త సినిమా విశేషాలు తెలియజేశారు. నిడదవోలుకు చెందిన ప్రముఖులు నాగిరెడ్డి సత్యనారాయం, నంగిన పాండు రంగారావు అతిధులు గా హాజరై సినిమా విజయ వంతం కావాలని కోరారు. 

వైసీపీ నాయకులు నేట్రూ గణేష్, అనిల్ పాల్గొన్నారు. పి ఆర్ ఓ కె ఎస్ శంకర రావు కార్యక్రమం నిర్వహించారు. అసోసియేట్ డైరెక్టర్ వాసు స్వాగతం పలికారు. పలువురు కొత్త పాత నటీ నటులు తమ ఆకాంక్షలు అనుభవాలు తెలిపారు. విశాఖపట్నం, విజయవాడ, రాజమండ్రి పాలకొల్లు, ఏలూరు తదితర ప్రాంతాల నుంచి పలువురు ఔత్సాహక నటి నటులు పాల్గొన్నారు.