Ticker

6/recent/ticker-posts

అగస్ట్ 4న జిల్లా కేంద్రాలలో జర్నలిస్ట్ ల డిమాండ్స్ డే.


ఏపీ డబ్ల్యూ జె ఎఫ్ రాష్ట్ర కమిటీ, జిల్లాకమిటీల పిలుపు..


ఏలూరు జిల్లా, ఏలూరు/జంగారెడ్డిగూడెం: పరిష్క్రతంగా వున్న పాత్రి కేయుల సమస్యలు పరిష్కారం చెయ్యాలని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ల సమాఖ్య( ఏపీ డబ్ల్యూ జె ఎఫ్) ఆధ్వర్యంలో ఆగస్టు 4వ తేదిన జర్నలిస్టుల డిమాండ్స్ డే నిర్వహించాలని నిర్ణయించింది. 

రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఆగస్టు 4 సోమవారం జిల్లా కేంద్రాల్లో డిమాండ్స్ డే చేపట్టాలని పిలుపు నిచ్చిందని రాష్ట్ర కార్యదర్శి కె ఎస్ శంకర రావు, ఏలూరు జిల్లా అధ్యక్ష కార్యదర్సులు ఎస్ డి జబీర్, హరీష్ తెలిపారు. ఈ మేరకు సోమవారం ఒక సంయుక్త ప్రకటనలో జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోరుతూ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జూన్ 11న డిమాండ్స్ డే కార్యక్రమం విజయవంతంగా నిర్వహించామని దీన్ని కూడా సక్సెస్ చెయ్యాలని విజ్ఞప్తి చేశారు.
 
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆగస్టు 6వ తేదీన సమావేశమై జర్నలిస్టుల సమస్యల పరిష్కారం గురించి చర్చించబోతోందని జర్నలిస్టుల ఇంటి స్థలాల సమస్య, సీనియర్ జర్నలిస్టులకు పెన్షన్, అక్రిడిటేషన్ల జీవో జారీ తదితర అంశాలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని అన్ని జిల్లా శాఖలు ఆగస్టు 4వ తేదీ సోమవారం జిల్లా కేంద్రాలలో ఆయా సమస్యలపై వినతిపత్రాలు అందజేయాలని రాష్ట్ర కమిటీ కోరినట్టు పేర్కొన్నారు. జిల్లాల పర్యటనలో ఉండే మంత్రులకు ప్రజాప్రతినిధులకు, జిల్లాస్థాయి అధికారులకు తప్పనిసరిగా వారు ఎక్కడ ఉంటే అక్కడ కలిసి వినతి పత్రాలు అందజేయాలని సూచించారు. 

రాష్ట్రంలోని 26 జిల్లా కేంద్రాలలో ఈ కార్యక్రమం విజయవంతం చేయడం ద్వారా ఫెడరేషన్ జర్నలిస్టుల సమస్యల పట్ల చూపే చోరవ కనిపించే రీతిలో మన కార్యక్రమం నిర్వహించాలని అలాగే స్థానిక పరిస్థితిని బట్టి ప్రజా ప్రతినిధులను కలవడం చెయ్యలని కోరారు. పైన ప్రస్తావించినా ప్రధాన సమస్యలకు తోడుగా మీ జిల్లాలలో స్థానికంగా ఉండే సమస్యలను కూడా జోడించి వినతి పత్రాలను అందజేయయాలని, అలాగే కార్యక్రమం విజయవంతం చేయడానికి అన్ని జిల్లా శాఖలు స్పందించి పనిచేయాలని పేర్కొన్నారు.