నారా వారి సొంత నియోజకవర్గం చంద్రగిరి. ఈ నియోజకవర్గం పరిధిలోనే నారావారి పల్లె అని ఉంది. అదే చంద్రబాబు కుటుంబం పూర్వీకులకు పుట్టినిల్లు.
ANDHRAPRADESH:చిత్తూరు జిల్లాలో ఉన్న చంద్రగిరి నియోజకవర్గానికి రాజకీయంగా చారిత్రాత్మకంగా ఎంతో ప్రాధాన్యత ఉంది. దక్షిణ భారత దేశాన్ని అంతా ఒక్కటిగా చేసి ఏలిన చక్రవర్తి శ్రీక్రిష్ణదేవరాయల ఆస్థానంలో మహా మంత్రిగా పనిచేసిన తిమ్మరుసు విద్యాబుద్ధులు గరపినది చంద్రగిరిలోనే. చంద్రగిరి అంటే మరో విషయం ఆధునిక రాజకీయాల్లో గుర్తుకు వస్తుంది. చంద్రబాబు తన రాజకీయ జీవితం అక్కడ నుంచే ప్రారంభించారు. ఆయన 1978లో తొలిసారి కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా గెలిచింది చంద్రగిరి నుంచే
నారా వారి సొంత ఇలాకాగానే
నారా వారి సొంత నియోజకవర్గం చంద్రగిరి. ఈ నియోజకవర్గం పరిధిలోనే నారావారి పల్లె అని ఉంది. అదే చంద్రబాబు కుటుంబం పూర్వీకులకు పుట్టినిల్లు. అక్కడే చంద్రబాబు పుట్టారు. ఆయన తాత తండ్రులు అంతా అక్కడే ప్రస్థానం సాగించారు. అలాంటి సొంత నియోజకవర్గం 1983లో బాబుకు హ్యాండ్ ఇచ్చింది. ఆయన కాంగ్రెస్ తరఫున మంత్రిగా ఉంటూ పోటీ చేస్తే టీడీపీ నుంచి ఒక సామాన్యుడు ఆయన్ని ఓడించి నెగ్గారు. దాంతో బాబు 1989 నుంచి కుప్పం అసెంబ్లీని తన సొంత సీటుగా చేసుకుని అక్కడే పోటీ చేస్తూ వచ్చారు.
ఆ పార్టీలకు కంచుకోటగా
ఇక చంద్రగిరి రాజకీయం తీసుకుంటే కాంగ్రెస్ వైసీపీలకు కంచుకోటగా ఉంది. ఈ సీటు నుంచి గతంలో కాంగ్రెస్ గెలిచింది. తరువాత వైసీపీ గెలుస్తోంది. అయితే 2024లో మాత్రం కూటమి ప్రభంజనంతో టీడీపీ గెలుపు పిలుపుని చూసింది. అయితే ఈ విజయానందం శాశ్వతం చేసుకోవాలని టీడీపీ అధినాయకత్వం భావిస్తోంది. అందుకే చంద్రగిరి మీద ప్రత్యేక శ్రద్ధ చూపిస్తోంద.
చెవిరెడ్డి ఫ్యామిలీ హవా
ఇక చంద్రగిరి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి హవా ఉంది. 2024 ఎన్నికల్లో ఆయన తనయుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పోటీకి దిగారు. తొలి ప్రయత్నంలోనే ఓటమి పాలు అయ్యారు. అయినా సరే రాజకీయంగా వైసీపీ బలంగానే ఉంది. దాంతో ఈసారి ఎమ్మెల్యేగా గెలిచిన పులవర్తి నాని కంటే నారా వారి కుటుంబం నుంచి సరైన వారిని తెస్తే కనుక విజయం తధ్యమని చంద్రబాబు లోకేష్ ఆలోచిస్తున్నారు అని అంటున్నారు.
రాజకీయ బాణం అటు వైపే
బాణం సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన నారా రోహిత్ ని రంగంలోకి దింపాలని చూస్తున్నారు అని అంటున్నారు ఆయన చంద్రబాబు తమ్ముడు రామ్మూర్తి నాయుడు కుమారుడు. ఇక నారా రామ్మూర్తి నాయుడు 1995లో ఒకసారి చంద్రగిరిలో గెలిచారు. అలా నాన్న పెదనాన్న ఎమ్మెల్యేలుగా చేసిన చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నారా రోహిత్ కి చాన్స్ ఇవ్వాలని చూస్తున్నారు అని అంటున్నారు. ఆయన కూడా సినిమాలను తగ్గించేశారు. దాంతో పాటు చంద్రబాబు లోకేష్ మాట మేరకు రాజకీయాల్లోకి రావాలని ఆసక్తి చూపిస్తున్నారు అని అంటున్నారు.
హీరో ఇమేజ్ వర్కౌట్ అయ్యేనా
ఇక చూస్తే నారా లోకేష్ ని ఎవరూ పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆయన సొంత ఇలాకాగా చంద్రగిరి. పైగా హీరోగా అనేక సినిమాలు చేసి ఉన్నారు. దాంతో ఆయన సినీ ఇమేజ్ కూడా వర్కౌట్ అవుతుందని భావిస్తున్నారు. ఇక నారా వారి కుటుంబం మద్దతు పూర్తిగా ఉంటుంది. దాంతో ఇప్పటి నుంచే పార్టీని పటిష్టం చేసుకుంటూ వెళ్తే కనుక 2029లో నారా రోహిత్ ఎమ్మెల్యే అభ్యర్ధిగా చంద్రగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు మార్గం సుగమం అవుతుందని భావిస్తున్నారు. ఇక చెవిరెడ్డి అరెస్టు అయ్యారు. కేసులలో ఆయన ఫ్యామిలీ ఇబ్బందులు పడుతోంది. దీంతో ఇదే అదనుగా టీడీపీ మరింతగా దూసుకుని పోవాలని చూస్తోంది అని అంటున్నారు.
Social Plugin