Ticker

6/recent/ticker-posts

అనన్య యూనిట్ కు ప్రముఖుల అభినందన.. నటీనటులు, టెక్నీషియన్లకు సత్కారం


అనన్య యూనిట్ కు ప్రముఖుల అభినందన.. నటీనటులు, టెక్నీషియన్లకు సత్కారం: రాష్ట్ర జానపద కళా కారుల సంఘం ఆధ్వర్యంలో సమావేశం..

ఏలూరు జిల్లా, జంగారెడ్డిగూడెం ప్రతినిధి: ప్రేక్షకులకు నచ్చిన సినిమాయే గొప్ప సినిమా అని అందులో చిన్న పెద్ద అని వ్యత్యాసం లేదని రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు చిన్ని రామ సత్యనారాయణ(సి హెచ్ ఆర్) అన్నారు. జంగారెడ్డిగూడెం పరిసరాల్లో నిర్మాణం జరుపుకున్న అనన్య చిత్రం విజయ వంతంగా ప్రదర్శించబడుతున్న సందర్భంగా సోమవారం రాష్ట్ర జానపద కళా కారుల సంఘం అధ్యక్షుడు ఎల్ ఆర్ కృష్ణ బాబు ఆధ్వర్యంలో ఆనన్య చిత్రం యూనిట్ కు అభినందన సత్కార సభ నిర్వహించారు. 

కృష్ణ బాబు అధ్యక్షుతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా సి హెచ్ ఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిత్రంలో నటించిన పలువురు నటీనటుల సాంకేతిక నిపుణులను ఇతర విభాగాలవారిని జానపద కళా కారుల సంఘం తరఫున దుస్సాలువతో అతిధులను సత్కరించి మెమెంటోలు అందజేశారు. ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు బి ప్రసాద రాజు, జంధ్యాల గంగాధర శర్మ,, బుద్దాల సత్యనారాయణ స్థానికంగా సినిమా నిర్మాణ సమయంలో తమకు ఎదురైన అనుభవాలు వివరించారు. సమీప తిరుమలాపురం గ్రామంలో 112 ఏళ్ళ క్రిందట నిర్మించిన కనుపర్తి వారి పురాతన ఇళ్లల్లో చిత్రీకరణ జరిపామని చెప్పారు. 

సమీప గ్రామాల వారు, సంస్థలు సహకారాన్ని అందించారని కృతజ్ఞతలు తెలిపారు. ఈ విజయం ప్రజలకు అంకితం అన్నారు. సినిమాలకు నిర్మాణం చేయడానికి ఈ ప్రాంతం ఎంతో అనుకూలత, ఖర్చు తక్కువ అని పేర్కొన్నారు. అన్ని సౌకర్యాలు, వనరులు ఉన్నాయని తెలిపారు. తమ రెండో చిత్రాన్ని ఇక్కడే మొదలు పెడుతున్నట్టు డైరెక్టర్ ప్రసాద రాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా నిర్మాత, దర్శకులని హీరో వెంకట్, విలన్ గా నటించిన రాజేష్, ఇతర పాత్రధారులు దుర్గా ప్రసాద్, రాజేశ్వరి, కుమారి, పి ఆర్ ఓ కె ఎస్ శంకర రావు, పాటల రచయిత నవీన్ విల్లురి, అసిస్టెంట్ డైరెక్టర్ అఖిల్ లను ఘనంగా సత్కరించారు. 

ఈ సమావేశంలో ఎస్ ఆర్ మూవీ క్రియేషన్స్ అధినేత సింగంశెట్టి సత్యరాజ్, పట్టణ వైసిపి అధ్యక్షుడు చిటికిన అచ్చిరాజు, కె ఎల్ ఎన్ ధనకుమార్ తదితరులు పాల్గొన్నారు. పట్టణ స్వర్ణ కారుల సంఘ అధ్యక్షుడు ఎల్ భోగేశ్వర రావు ఆధ్వర్యంలో డైరెక్టర్ ప్రసాద రాజును సన్మానించారు. సీనియర్ కళాకారులు కాసర నర్సిరెడ్డి, సి హెచ్ సుబ్బయ్యా చారి, నృత్య కళా కారిణి రూపాదేవి, మానవత కన్వీనర్ త్రిపుర రమేష్, వేగవరం సర్పంచ్ నాగరాజు, కొలకలూరి సత్య న్నారాయణ తదితరులు పాల్గొన్నారు.