Ticker

6/recent/ticker-posts

అమెరికాలో భారత వైద్యుడికి 168 నెలల జైలు శిక్ష!


అగ్రరాజ్యం అమెరికాలో చేయకూడని పనులు చేసి.. ఇటు స్వదేశం పరువు తీస్తూ, అటు జైలు పాలవుతున్న భారతీయులు, భారత సంతతి జనాల సంఖ్య ఇటీవల ఎక్కువగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా భారత సంతతికి చెందిన ఓ వైద్యుడికి 168 నెలలు (14 ఏళ్లు) జైలు శిక్ష విధించింది కోర్టు. ఆ వివరాలేమిటో ఇప్పుడు చూద్దామ్...!


అమెరికాలో మరో భారత సంతతికి చెందిన వ్యక్తికి జైలు శిక్ష విధించబడింది. ఇందులో భాగంగా... భారత సంతతికి చెందిన ఓ వైద్యుడికి 14 ఏళ్ల జైలుశిక్ష విధించారు. నిషేధిత పదార్థాల అక్రమ పంపిణీతో పాటు ఆన్‌ లైన్, ఆరోగ్య సంరక్షణ పథకాల్లో మోసం, మనీలాండరింగ్‌ వంటి పలు నేరాలకు పాల్పపడినట్లు కోర్టు నిర్ధారించింది.

పెన్సిల్వేనియాలోని బెన్సలేంలో నివాసంముంటోన్న 48 ఏళ్ల నీల్‌ కె.ఆనంద్‌.. పైన పేర్కొన్న అక్రమాలకు పాల్పడినట్లు నిర్ధారించిన కోర్టు.. 20 లక్షల డాలర్ల (సుమారు రూ. 17.7 కోట్లు) జరిమానా కూడా చెల్లించాల్సిందిగా ఆదేశించింది. ఇదే సమయంలో.. ఇతర ఖాతాలకు బదిలీచేసిన మరో 20 లక్షల డాలర్లను జప్తు చేస్తున్నట్లు న్యాయశాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. అమెరికా కార్యాలయం అందించిన 

పలు ఆరోగ్య పథకాలు, వైద్యపరంగా అనవసరమైన మందులు ఇవ్వడం, తప్పుడు క్లెయిమ్‌ ల కోసం కుట్ర పన్నడం వంటి పలు నేరాల్లో ఆనంద్‌ ను కోర్టు ఈ ఏడాది ఏప్రిల్‌ లో దోషిగా నిర్ధారించింది. పలు పథకాల కింద ఆరోగ్య సంస్థలు ఆనంద్‌ కు 24 లక్షల డాలర్లను చెల్లించాయని విచారణలో వెల్లడైంది!

ఈ పథకాన్ని ముందుకు తీసుకెళ్లడంలో భాగంగా.. లైసెన్స్ లేని మెడికల్ ఇంటర్న్‌ లు జారీ చేయడానికి ఆనంద్ నుండి ముందే సంతకం చేసిన ఖాళీ ప్రిస్క్రిప్షన్‌ లను ఉపయోగించాయని.. ఆనంద్ కేవలం తొమ్మిది మంది రోగులకు 20,000 కంటే ఎక్కువ ఆక్సికోడోన్ మాత్రలను సూచించినట్లు కోర్టు రికార్డులు చూపిస్తున్నాయని అంటున్నారు. ఈ సందర్భంగా స్పందించిన యుఎస్ జిల్లా జడ్జి చాడ్ ఎఫ్ కెన్నీ స్పందిస్తూ... ఆనంద్ తన రోగుల అవసరాల కోసం కాకుండా.. దురాశ, అక్రమ లాభాల కోసం ప్రేరేపించబడ్డాడని తాను నమ్ముతున్నానని అన్నారు.