అమ్మబోతే అడవి.. కొనబోతే కొరివి అన్నట్లుగా వ్యవసాయ ఉత్పత్తులు ఉంటాయి. బహిరంగ మార్కెట్లో ధరలు బాగానే ఉన్నా.. వాటిని కష్టపడి పండించే రైతులకు మాత్్రం చాలీచాలని డబ్బులు లభించే దుస్థితి. తాజాగా టమోటా రైతుల పరిస్థితి దీనాతిదీనంగా మారింది.దీనికి కారణం కర్నూలు మార్కెట్లో లో కేజీ టమోటా కనిష్ఠంగా యాభై పైసలు.. గరిష్ఠంగా రూపాయి మాత్రమే లభిస్తున్న దుస్థితి.
దీంతో టమోటా రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట దిగుబడి భారీగా ఉండటంతో పెద్ద ఎత్తున మార్కెట్లోకి వచ్చింది. దీంతో.. ధరలు భారీగా పడిపోయాయి. వ్యాపారులు సైతం టమోటా పంటను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపలేదు. ధర విషయంలో వారికి ఎదురైన చేదు అనుభవంతో రైతులు తీవ్ర ఆగ్రహానికి గురవుతున్నారు.
ఊళ్ల నుంచి కర్నూలుకు తీసుకొచ్చిన టమోటా లోడ్ కు అయ్యే రవాణా ఖర్చులు కూడా చేతికి రాని పరిస్థితి. దీనికి తోడు వ్యాపారులు చెబుతున్న ధరలతో ఒళ్లు మండిన టమోటా రైతులు మార్కెట్లో పారబోసి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏపీలోని కూటమి రైతులు స్పందించి.. రైతులకు అండగా నిలవాల్సిన అవసరం ఏర్పడింది. ఇలాంటి వేళలో.. కష్టపడి పండించిన పంటకు తగిన ధరలు అందేలా చర్యలు తీసుకుంటే బాగుండేది కదా? అన్నదిప్పుడు చర్చగా మారింది.


.jpeg)
