Ticker

6/recent/ticker-posts

హిందీ పండిట్ గడ్డి నాగేశ్వరరావుకు గౌరవ డాక్టరేట్ ప్రదానం..


విశాఖపట్నం/జంగారెడ్డిగూడెం: డే స్ప్రింగ్ థియోసాఫికల్ యూనివర్సిటీ టెక్సాస్ యూ ఎస్ ఏ చైర్మన్ అండ్ ఫౌండర్ ఎం.వి. ప్రసాద్, ఎన్జీవో నీతి అయోగ్ గాడ్ సన్ హోలీ స్పిరిట్ ఎమ్మెస్ ఎం ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తదితర ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన హిందీ పండిట్ గడ్డి నాగేశ్వరావుకు గౌరవ డాక్టర్ రేట్ బహుకరించడం జరిగింది. 

విశాఖపట్నం ద్వారకా నగర్ పౌర గ్రంథాలయము నందు డాక్టరేట్ బిరుదు ఉగాది సందర్బంగా ప్రధానోత్సవం చేశారు. హిందీ పండిట్ గా జడ్పీ హైస్కూల్ వేదాంతపురం పనిజేస్తున్నారు. సామాజిక సేవలో గుర్తింపుగా నాగేశ్వర్ రావుకు డాక్టరేట్ బిరుదు ఇవ్వడం జరిగింది. ఈ మహత్తర కార్యక్రమంలో ప్రత్యేక ఆహ్వానితులుగా నేషనల్ అవార్డు గ్రహీత దాసరి నారాయణ రావు జాతీయ ఉగాది పురస్కార గ్రహీత డా.బి. జయ ప్రకాష్, ఎస్.ఆర్ టి.వి అధినేత సింగంశెట్టి సత్యనారాయణ, శ్రీకృష్ణదేవరాయ ఉగాది జాతీయ పురస్కార గ్రహీత ఎపి జానపద కళాకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎల్ ఆర్ కృష్ణ బాబు, రాష్ట్ర ప్రచార కార్యదర్శి లక్ష్మీపతి, రాష్ట్ర కోఆర్డినేటర్ ధనంజయ పాల్గొన్నారు.
 
డాక్టరేట్ బిరుదు పొందిన హిందీ పండిట్ డాక్టర్ గడ్డి నాగేశ్వరరావును ఈ సందర్బంగా పలువురు పెద్దలు అభినందించారు. డాక్టర్ గడ్డి నాగేశ్వరావు హిందీ పండిట్ గా తన వృత్తిని సాగిస్తూ ఉభయ గోదావరి జిల్లాలో అనేకమందిని హిందీ పండిట్లుగా శిక్షణ ఇప్పించి గుర్తింపు పొందారు. వారిని గవర్నమెంట్ ఉపాధ్యాయులుగా తయారు చేయడమే గాక పలు సేవా కార్యక్రమాలు కూడా పాల్గొని స్వచ్ఛంద సేవ సంస్థల వారితో కలిసి పని జేస్తున్నారు.