Ticker

6/recent/ticker-posts

ఎర్రకాల్వలో చిక్కిన భారీ చేపలు


జంగారెడ్డిగూడెం - ప్రతి నిధి: ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం సమీపం కొంగువారిగూడెం ఎర్రకాలువ ప్రాజెక్టులో భారీ సైజు చేపలు లభ్యం అవుతున్నాయి. వేటగాళ్ల వలలకు చిక్కడంతో మాంసాహారులు సంతోషంతో పోటీ పడి ధర పెట్టి కొనుగోలు చేశారు. లోకల్ మార్కెట్ లోను కొంగువారిగూడెం, పుట్లగట్లగూడెం మార్కెట్ లోను ఈ భారీ మీనాలు అమ్మకానికి పెట్టగా గంటల్లో అమ్ముడుపోయాయని పాతబస్టాండ్ మీనీ మార్కెట్ లో లక్ష్మీ అనే చేపల వ్యాపారి తెలిపారు.

సుమారు20 కిలోల బొచ్చె జాతి చేపలు ఎర్రకాలువ ప్రాజెక్టులో వేటగాళ్లకు లభ్యం అయ్యాయని పేర్కొన్నారు. సాధారణంగా బ్రతికి ఉన్న చేపలు ఆ సైజులో ఎక్కడా లభ్యమయ్యే అవకాశం ఉండదని, ఐస్ లో పెట్టి మార్కెట్ కి తేవడం జరుగుతుంది. కానీ అవి వేటగాళ్ల వలలకు చిక్కిన 4,5 గంటల తరువాత కూడా నోరు తెరచి గాలి పీలుస్తూ కనిపించే సరికి చేపల ప్రియులు పోటీ పడ్డారు. 

చివరకు ప్రముఖ వ్యాపార వేత్త, ఎస్ ఆర్ గ్రూపు అధినేత
సింగంశెట్టి సత్యరాజ్ తమ మిత్రబృందం కోసం భారీ మీనాన్ని కొనుగోలు చేశారు. అరుదుగా లభ్య మయ్యే చేపని ప్రముఖులకు సన్నిహితులకు కానుకగా అందించారు. మిగతా వాటిని మరికొందరు కొని భాగాలు వేసుకుని పంచుకున్నారు. వాతావరణంలో ఒక్కసారిగా వచ్చిన మార్పుల కారణంగా మనుషులతో పాటు పశుపక్ష్యాదులు అల్లాడుతున్నాయి. రోహిణి కార్తెలో ఎండ వేడిమికి రోళ్లే పగులు తాయని పెద్దలు చెబుతారు.. నేల మీద తిరిగే జీవులే కాకుండా నీళ్లలో సంచరించే ప్రాణులు సైతం ఉష్ణ తాపానికి అల్లాడు తున్నాయి. 

సుమారు 4 వేల ఎకరాల్లో విస్తరించి ఉన్న చక్రదేవరపల్లి కరాటం కృష్ణమూర్తి ఎర్రకాలువ ప్రాజెక్టులో భారీ సైజు చేపలు వేటగాళ్ల వలలకు చిక్కుతున్నాయి. సుమారు మూడేళ్ళ వయస్సు ఉన్న భారీ మీనాలు రోహిణీలో నీటిలో పెరిగిన ఉష్ణోగ్రతలను తట్టుకో లేక నీళ్లపైకి వచ్చి వేటగాళ్ల వలకు చిక్కి మాంసాహారులకు పలహారమవుతున్నాయి. గత రెండు రోజులుగా సుమారు 20 కిలోల బరువుండే పెద్ద పెద్ద చేపలు ప్రాజెక్టులో లభ్యమవుతున్నాయి. 

జంగారెడ్డిగూడెం టౌన్ లో పాత బస్టాండ్ వద్ద పుట్లగట్లగూడెం లోకల్ మార్కెట్ లోను వేగవరం గ్రామంలో వీటిని అమ్మకానికి పెట్టారు. అధిక ధర చెల్లించి పెద్ద చేపల రుచి తెలిసిన వారు ఎగరేసుకు పోతున్నారు. సాధారణంగా ఈ సైజు చేపలు వర్షాలు కురిసిన తరుణంలో వరద నీటి రుచిని ఆస్వాదిస్తూ ఎదురీత ద్వారా వేటగాళ్లు పెట్టిన వలల్లో పడతాయని వేటగాళ్ల ప్రతినిధికి తెలిపారు. కానీ ప్రస్తుతం నీటిలోవేడిని తట్టుకోలేక బయటకు వస్తున్నాయని పేర్కొన్నారు.