Ticker

6/recent/ticker-posts

ఏపీలో ప్రభుత్వం మారిపోతోంది..! ఒప్పందాలు వద్దంటూ సింగపూర్ కు మెయిల్స్..!


ANDHRPRADESH:ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి ఏడాది దాటింది. ప్రస్తుతం రెండో ఏడాది కొనసాగుతోంది. అయితే ఐదేళ్లకోసారి ప్రభుత్వాలు మారుతున్న ఏపీలో ఈసారి కూడా అదే ట్రెండ్ కొనసాగబోతోందనే చర్చను విపక్షాలు తెరపైకి తెస్తుంటాయి. అయితే సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ తాజాగా సింగపూర్ పర్యటనలో ఉండగా.. అక్కడి ప్రభుత్వానికి ఇదే అంశంపై ఓ మెయిల్ వచ్చిందంట. దీంతో అక్కడి ప్రభుత్వం చంద్రబాబు, లోకేష్ ను ఆరా తీసినట్లు తెలుస్తోంది.

గతంలో అమరావతి రాజధాని నిర్మాణం కోసం ఏపీకి వచ్చి సింగపూర్ కన్సార్టియం చేతులు కాల్చుకుంది. అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం సింగపూర్ కన్సార్టియాన్ని కోర్ క్యాపిటల్ నిర్మాణంలో భాగస్వామిని చేసింది. అయితే ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం అమరావతి స్ధానంలో మూడు రాజధానులు తీసుకురావడంతో చేసేది లేక సింగపూర్ కన్సార్టియం ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. దీంతో మరోసారి రాజధాని నిర్మాణానికి ముందుకు రాలేమంటూ తాజాగా తేల్చేసింది.

ఈ నేపథ్యంలో సింగపూర్ సంస్థల్ని రాజధాని నిర్మాణానికి కాకపోయినా ఈ ప్రాంతంలో ఇతర సంస్ధలు, ప్రభుత్వ నిర్మాణాల్లో వాడుకునేలా ఒప్పందాలు చేసుకునేందుకు చంద్రబాబు, లోకేష్ అక్కడ పర్యటించారు. ఈ సమయంలోనే ఏపీ నుంచి మురళీ కృష్ణ అనే వ్యక్తి నుంచి సింగపూర్ ప్రభుత్వానికి ఓ మెయిల్ వచ్చిందని నారా లోకేష్ వెల్లడించారు. ఆ మెయిల్ లో ఈసారి కూడా రాష్ట్రంలో ప్రభుత్వం మారిపోతోందని, కాబట్టి కూటమి ప్రభుత్వంతో ఎలాంటి ఒప్పందాలు చేసుకోవద్దని అందులో ఉందట.

మురళీకృష్ణ అనే వ్యక్తి సింగపూర్ ప్రభుత్వంలో మంత్రులు, హైకమిషనర్ కు సైతం మెయిల్స్ పంపాడని, ఏపీలో అస్థిర ప్రభుత్వం ఉందని, ఈసారి ప్రభుత్వం మారిపోబోతోందని ఈ మెయిల్ లో ఉందని నారా లోకేష్ తెలిపారు. కాబట్టి ప్రభుత్వంతో ఎలాంటి ఒప్పందాలు చేసుకోవద్దని కూడా ఉందులో కోరాడన్నారు. దీనిపై ఆరా తీస్తే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చెందిన పీఎల్ ఆర్ కన్ స్ట్రక్షన్స్ అనే సంస్ధలో పనిచేసే ఉద్యోగిగా తేలిందన్నారు. ఇది రాజకీయాల్ని నేరపూరితం చేయడమే అన్నారు.