ANDHRPRADESH:ఆంధ్రప్రదేశ్‌లో 6,100 పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి సంబంధించి తుది ఫలితాలు విడుదలయ్యాయి. అభ్యర్థులు తమ ఫలితాలను APSLPRB అధికారిక వెబ్‌సైట్ https://slprb.ap.gov.in ద్వారా చెక్ చేసుకోవచ్చు.
ఈ ఫలితాల్లో గండి నానాజి అత్యధికంగా 168 మార్కులు సాధించి టాపర్ గా నిలిచారు. రెండో స్థానంలో జి. రమ్య మాధురి 159 మార్కులు.. మూడో స్థానంలో మెరుగు అచ్యుతారావు 144.5 మార్కులతో ఉన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, రిక్రూట్‌మెంట్ బోర్డు ఛైర్మన్ ఆర్.కె. మీనా తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
కాగా ఈ నియామక ప్రక్రియకు సంబంధించి రాతపరీక్ష, శారీరక ప్రమాణాలు (PMT), ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET) వంటి దశల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేశారు. మొత్తం 4.5 లక్షల మందికి పైగా అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. ఎంపికైన అభ్యర్థులకు త్వరలోనే అపాయింట్మెంట్ ఆర్డర్స్ జారీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. అంతే కాకుండా ఎంపికైన అభ్యర్థులు త్వరలోనే వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ తదితర దశలకు హాజరు కావలసి ఉంటుంది. అనంతరం శిక్షణకు పంపుతారు. ఫలితాలపై సందేహాలుంటే అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లోని హెల్ప్‌డెస్క్ ద్వారా సమాచారం పొందవచ్చు.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వివిధ పోలీస్ స్టేషన్లు, ట్రైనింగ్ అకాడమీలు, స్పెషల్ యూనిట్లలో వీరు నియమించబడతారు. సమగ్రంగా, పారదర్శకంగా రిక్రూట్‌మెంట్ ప్రక్రియను పూర్తి చేయడం గర్వంగా ఉందని హోం మంత్రి వంగలపూడి అనిత వ్యాఖ్యానించారు.
Social Plugin