Ticker

6/recent/ticker-posts

నూజివీడు పట్టణాన్ని స్మార్ట్* *సిటీగా తీర్చిదిద్దుతాం: మంత్రి కొలుసు పార్థసారధి


నూజివీడు/ఏలూరు: నూజివీడు పట్టణాన్ని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర గృహనిర్మాణ మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి స్పష్టం చేశారు. సోమవారం నూజివీడు పురపాలక సంఘ 2025- 2026 బడ్జెట్ అంచనాలు ప్రతి పాధనలపై కౌన్సిల్ సాధారణ సమావేశం మున్సిపల్ సమావేశ మందిరంలో జరిగింది.

ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర గృహనిర్మాణ మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి మాట్లాడుతూ నూజివీడు పట్టణాన్ని ఆదర్శ పట్టణంగా నిలిపేందుకు అందరి సమయస్ట కృషి ఎంతో అవసరమన్నారు. 

సుమారు రూ,51 కోట్లతో పొందుపర్చిన మొత్తం బడ్జెట్ పారదర్శంగా ప్రజలకు ఉపయోగ పడే విదంగా ఖర్చు పెడతామని, ప్రజల అవసరాలు సంక్షేమం, అభివృద్ధికి, ప్రభుత్వంతో మాట్లాడి తమవంతు కృషి చేస్తానని, మరిన్ని నిధులు తెచ్చి పట్టణ అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు, పట్టణ అభివృద్ధికి ఇప్పటికే రూ,30 కోట్లతో రోడ్లు, డ్రైనేజీలు మెరుగు పర్చామని అన్నారు. నూజివీడు మామిడి యార్డు అభివృద్ధికి రూ,30 కోట్లు వెచ్చించి మరింత అభివృద్ది చేస్తున్నట్లు మంత్రి అన్నారు.

సుమారు రూ,7 కోట్లతో త్వరలో తుక్కులూరు నుండి అన్నవరం బైపాసు రోడ్డు నిర్మిస్తున్నట్లు మంత్రి తెలిపారు. పట్టణంలో త్వరలో రూ,80 లక్షలతో స్టేడియం అభివృద్ధి చేస్తామన్నారు. ఎమ్, ఆర్, అప్పారావు కాలనీ రూ,50 లక్షలతో అభివృద్ధి చేస్తునట్లు మంత్రి తెలిపారు. పట్టణంలో ఇప్పటికే కృష్ణా శుద్ధ జలాలు నగర వాసులకు అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. నియోజక అభివృద్ధికి ఇప్పడికి వందల కోట్లు ఖర్చు చేశామని అన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని ప్రభుత్వ నిధులతో నగరాన్ని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుతామని మంత్రి అన్నారు.

కౌన్సిల్ సమావేశంలో పలువురు కౌన్సిలర్లు పట్టణ అభివృద్ధి విషయంపై తమ అభిప్రాయాలను తెలియజేయగా మున్సిపల్ కమిషనర్ సమాధానం తెలిపారు. కౌన్సిలర్ గిరీష్ మాట్లాడుతూ శానిటేషన్ సిబ్బందికి గత 5 సంవత్సరాల నుండి సిబ్బందికి శానిటేషన్ మెటీరియల్, మరియు దుస్తులు పంపిణీ చేయక పోవడంతో నానా ఇబ్బందులు పడుతున్నారని తెలియజేయగా, వాటిని త్వరలో అందజేస్తామని కమీషనర్ తెలిపారు. 

కౌన్సిలర్ రామయ్య మాట్లాడుతూ పట్టణంలో డ్రైనేజీ వ్యవస్థ, రోడ్ల సమస్యలు ఎక్కువగా ఉన్నాయని త్వరలో పరిష్కరించాలని కోరగా త్వరలో రోడ్లు, డ్రైనేజీ పూర్తి మరమ్మత్తులు చేస్తామని మంత్రి సమాధానం ఇచ్చారు. 

కౌన్సిలర్ సత్యనారాయణ మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా పెండింగులో ఉన్న ఇంటి పన్ను నీటి పన్నులు పెనాల్టీలు వేసి రెట్టింపు వసూలు చేస్తున్నారని ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ప్రజలకు భారం తగ్గించి కొంత వెసులుబాటు కల్పించాలని కోరగా ప్రభుత్వంతో మాట్లాడి వెసులుబాటు కల్పిస్తానని మంత్రివర్యులు సమాధానం ఇచ్చారు., 

కో ఆప్షన్ సభ్యులు దుర్గాప్రసాద్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చెత్తపై పన్ను ఎత్తివేసి ప్రజలకు ఎంతో మేలు చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. 

దుర్గాప్రసాద్ మాట్లాడుతూ పెండింగులో ఉన్న రోడ్లు స్టేడియం త్వరలో పూర్తి చేయాలని కోరగా త్వరలో పూర్తి చేస్తామని మంత్రి అన్నారు. 

మురళీ మాట్లాడుతూ 32 వార్డులు సమపాలలో అభివృద్ధి చేయాలని కోరగా మంత్రి సానుకూలంగా స్పందించారు. 

మరికొంత మంది కౌన్సిలర్లు మాట్లాడుతూ పెండింగులో ఉన్న ప్రభుత్వ సంస్థల,పెద్ద పెద్ద వ్యాపారస్తుల పన్ను బకాయలు వసూలు చేయాలని, ఎంత పెండింగ్ ఉందని ప్రశ్నించారు, కొంతమంది కౌన్సిలర్లు మాట్లాడుతూ పట్టణంలో చెత్త తరలించడానికి వార్డులకు సరిపోయే ట్రాక్టర్లు లేవని తెలియజేయగా మంత్రి స్పందించి వెంటనే ఎన్ని ట్రాక్టర్లు అవసరం అయితే అన్ని ట్రాక్టర్లు వెంటనే ఏర్పాటు చేస్తామని మంత్రి అన్నారు.

వైస్ చైర్మన్ మాట్లాడుతూ శానిటేషన్ వర్కర్లు విధులు ఎగ్గొట్టి బయట తిరగడంతో నగరంలో చెత్త పేరుకుపోతుందని మంత్రి దృష్టికి తేగా విధులు సక్రముగా చేయని వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఈ సమావేశంలో మున్సిపల్ చైర్ పర్సన్ త్రివేణి దుర్గా, మున్సిపల్ కమీషనర్ వెంకట రామిరెడ్డి, కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.