కార్యక్రమంలో పాల్గొన్న వారు మాట్లాడుతూ, ఏజెన్సీ ప్రాంతంలో తొలిసారిగా ఈ స్థాయి ఆధునిక నేత్ర వైద్యసేవలు ప్రారంభమవడం ఆనందదాయకమని తెలిపారు. సంస్థ మెడికల్ డైరెక్టర్, హెడ్ ఆఫ్ క్లినికల్ సర్వీసెస్ డా. సత్తి విజయ, మేకా శ్రీకాంత్, ఏపీ ఇన్‌చార్జి రాజేష్ క్లినిక్ ప్రత్యేకతలను వివరించారు. పూజా కార్యక్రమం అనంతరం అతిథులను దుశ్శాలువులతో ఘనంగా సత్కరించారు.
ఉచిత కంటి పరీక్షలు
ఈ సందర్భంగా ఏపీ ఇన్‌చార్జి రాజేష్ మాట్లాడుతూ, క్లినిక్‌లో ప్రాథమిక స్థాయి కంటి పరీక్షలను పూర్తిగా ఉచితంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. అవసరమైన వారికి కళ్లజోడులు అందించడంతో పాటు శస్త్రచికిత్సలు కూడా నిర్వహిస్తామని చెప్పారు. శస్త్రచికిత్స అవసరమైతే సమీపంలోని రాజమండ్రి, ఏలూరు కేంద్రాలకు రిఫర్ చేసే సదుపాయం ఉందన్నారు. వారానికి రెండు రోజులు అదనపు ప్రత్యేక పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించారు.
ప్రపంచవ్యాప్తంగా అనేక క్లినిక్‌లతో సేవలందిస్తున్న తమ సంస్థకు ఇది 351వ బ్రాంచ్ అని తెలిపారు. ప్రస్తుతం ఈ కేంద్రంలో ఇద్దరు ఆప్టోమెట్రిస్టులు అందుబాటులో ఉన్నారని, నాణ్యమైన వైద్యం కోసం ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.
కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ బత్తిన లక్ష్మి, సీనియర్ నాయకులు కరాటం రాంబాబు, పరిమి సత్తి పండు, కొండ్రెడ్డి కిషోర్, జెడ్పీటీసీ పోల్నాటి బాబ్జి, అర్జుల మురళీకృష్ణ, పెనుమర్తి రామ్‌కుమార్, రావూరి కృష్ణ, బత్తిన చిన్న, దాకారపు కృష్ణ, ముప్పిడి వీరాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.


.jpeg)
