Ticker

6/recent/ticker-posts

జంగారెడ్డిగూడెంలో పాత్రికేయుడు కలపాల శ్రీనివాసరావుకు జన్మదిన వేడుకలు ఘనంగా


జంగారెడ్డిగూడెం: అందరి వాడిగా, అందరినీ కలుపుకొని ముందుకు తీసుకెళ్లే పాత్రికేయుడు కలపాల శ్రీనివాసరావు అని AP Working Journalists Federation రాష్ట్ర కార్యదర్శి, ఏలూరు జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ సభ్యుడు కె.ఎస్. శంకరరావు పేర్కొన్నారు. గురువారం శ్రీనివాస్ జన్మదినాన్ని పురస్కరించుకుని పట్టణంలోని వారాహీ మూవీ కార్యాలయంలో జర్నలిస్టులు, సన్నిహితులు కలిసి ఘనంగా సత్కరించారు.


ఈ సందర్భంగా ఐదో వార్డు మున్సిపల్ సభ్యుడు వలవల తాతాజీ మాట్లాడుతూ, మంచికి మారుపేరు, స్నేహానికి చిరునామా శ్రీనివాసరావు అని ప్రశంసించారు. డివిజన్ అధ్యక్షుడు పి.ఎన్.వి. రామారావు తదితరులు హాజరై శుభాకాంక్షలు తెలిపారు.

కార్యక్రమంలో భాగంగా కలపాల శ్రీనివాసరావును దుశ్శాలువతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు. అనన్య సినిమా డైరెక్టర్ బి. ప్రసాద్ రాజు, భీమవరపు శ్రీనివాస్, నూజివీడు కిషోర్, కళాకారులు జగదీష్, జయరాజు తదితరులు పాల్గొని అభినందనలు తెలిపారు.

-----------------------------------------

🎉 అందరి వాడు – అందరినీ కలుపుకెళ్లే మన కలపాల శ్రీనివాస్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు! 🎂

నిజాయితీకి ప్రతీకగా, స్నేహానికి చిరునామాగా, పాత్రికేయ రంగంలో తనదైన ముద్ర వేసిన కలపాల శ్రీనివాస్ గారు ఆయురారోగ్యాలతో, మరిన్ని విజయాలతో ముందుకు సాగాలని మనసారా కోరుకుంటున్నాం. ఆయన కలం ఎప్పుడూ ప్రజల కోసం, సత్యం కోసం పరుగులు తీస్తూ ఉండాలి. 💐✨

-Sk. S. BABJI.