Ticker

6/recent/ticker-posts

టీవీ సౌండ్ తగ్గించమన్న భర్తను చంపిన ‘మంగళగిరి’ భార్య దారుణ


ANDRAPRADESH, GUNTURU: నేరాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. గతంలో హత్య లాంటి తీవ్రమైన నేరాల వెనుక చాలానే విషయాలు ఉండేవి. దారుణ నేరాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. గతంలో హత్య లాంటి తీవ్రమైన నేరాల వెనుక చాలానే విషయాలు ఉండేవి. ఇప్పుడు అకస్మాత్తుగా వచ్చే కోపం ప్రాణాల్నితీసే వరకు వెళుతోంది. అది కూడా జీవితభాగస్వామిపైనా. తాజాగా ఒక షాకింగ్ ఉదంతం గుంటూరు జిల్లాలోని మంగళగిరిలోచోటు చేసుకుంది. 


టీవీ సౌండ్ తగ్గించమన్న భర్తపై తీవ్ర ఆగ్రహంతో చంపేసిన భార్య ఉదంతం షాకింగ్ గా మారింది. ఏడాదిన్నర క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అహ్మద్.. క్రాంతి. వీరిద్దరూ గుంటూరు జిల్లా మంగళగిరి టిడ్కో ఇళ్ల సముదాయంలో (బి బ్లాక్) నివాసం ఉంటున్నారు. అహమ్మద్ ఏసీ మెకానిక్ గా పని చేస్తుంటే.. క్రాంతి ఒక ప్రైవేటు కంపెనీలో పని చేస్తోంది. అయితే.. వీరిది ప్రేమ వివాహం అయినప్పటికి.. పలుమార్లు గొడవపడటం పోలీస్ స్టేషన్లకు వెళ్లినట్లుగా చెబుతున్నారు. దీంతో.. వీరిద్దరికి కౌన్సెలింగ్ ఇచ్చి పంపేవారు. 

ఇద్దరిది వేర్వేరు మతాచారాలు కాావటంతో ఇద్దరూ ఉపవాసాలు ఉంటూ రోజూ భక్తి గీతాలు వినేవారు. క్రాంతి భక్తి పాటలు వింటుండగా.. అహ్మద్ సౌండ్ తగ్గించాలని కోరాడు. అయినప్పటికీ క్రాంతి నుంచి ఎలాంటి మార్పు లేకపోవటంతో.. వారిద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. గొడవ తీవ్ర రూపం దాల్చటంతో తీవ్ర ఆగ్రహానికి గురైన క్రాంతి వంటింట్లోని కూరగాయలు కోసే కత్తితో క్షణికావేశంలో భర్తను పొడిచింది. దీంతో అహమ్మద్ సొమ్మసిల్లి పడిపోయాడు. 

క్రాంతి వెంటనే అతడి తల్లికి ఫోన్ లో సమాచారం ఇచ్చింది. అదే సమయంలో స్థానికుల నుంచి వచ్చిన సమాచారంతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. గాయపడిన అహమ్మద్ ను తొలుత ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అనంతరం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.చికిత్స అందిస్తుండగా అహమ్మద్ మరణించాడు. క్రాంతిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. క్షణికావేశంతో భర్తను కత్తితో పొడిచిందా? ఇంకేమైనా కారణం ఉందా? అన్న కోణంలో మంగళగిరి పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ ఉదంతం స్థానికంగా సంచలనంగా మారింది.