సీనియర్ నాయకులు పరిమి సత్తి పండు..
జంగారెడ్డిగూడెం-ప్రతినిధి:
ఇటీవల జరిగిన ఎన్నికల్లో తెదేపా కూటమి ప్రభంజనం సృష్టించనున్నదని, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారని ఆపార్టీ సీనియర్ నాయకుడు, పరిమి సత్తిపండు ధీమా వ్యక్తం చేశారు. ఏలూరు పార్లమెంట్ పరిధిలోని అన్ని సీట్లు కూడా గెలుస్తామని అన్నారు.
చింతలపూడి కూటమి అభ్యర్థి సొంగారోషన్ కుమార్, పార్లమెంట్ అభ్యర్థి పుట్టా మహేష్ యాదవ్ ఘన విజయం ఖాయమని పేర్కొన్నారు. సత్తిపండు శుక్రవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ చింతలపూడిలో రోషన్ కుమార్ కనీసం 20 వేల ఓట్లకు పైగా మెజారిటీతో విజయం సాధించనున్నారని తెలిపారు.
దెందులూరు, పోలవరం సీట్ల గెలుపుపై అనుమానాలు ఉన్నాయని పోలింగ్ అనంతరం ఆ అనుమానాలు పటాపంచలు అయ్యాయని పేర్కొన్నారు. ప్రస్తుతం అక్కడా విజయ కేతనం ఎగర వేస్తామని చెప్పారు. డిసిసిబి ఎక్స్ ప్రెసిడెంట్ కరాటం రాంబాబు కృషి ఫలితంగా పోలవరం గెలుస్తామని దెందులూరు తమదే అని చెప్పారు.
చింతమనేనిపై ప్రజలు అభిమానం చెక్కు చెదరలేదని సత్తి పండు అన్నారు. జిల్లాలో ఎక్కడ ఏ విధమైన అలజడి లేదని మొత్తం ప్రశాంతంగా ఎన్నికలు జరిగాయని ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజలు సహకరించారని తెలిపారు. తెలుగుదేశం, బిజెపి, జనేసేన కూటమి సూపర్ సక్సెస్ వీరి సమిష్టి కృషి ఈ గెలుపని సత్తి పండు పేర్కొన్నారు.
చంద్రబాబు నాయుడు ప్రకటించిన సూపర్ 6 పధకాలు అందరికీ నచ్చినట్టు పోలింగ్ శాతం ద్వారా తెలుస్తోందని ఫలితాలు అందుకు అనుగుణంగానే వస్తాయని చెప్పారు.
Social Plugin