Ticker

6/recent/ticker-posts

ఆల్ ఇండియా రేడియో కళాకారుడు జయప్రకాష్ కు డా. దాసరి నారాయణ రావు జాతీయ అవార్డు


విశాఖరత్న సంస్థ ఆధ్వర్యంలో పురస్కారం అందుకున్న కళాకారుడు జయప్రకాష్

విశాఖపట్నం/జంగారెడ్డిగూడెం: ఉగాది సంబరాలలో భాగంగా విశాఖపట్నం ద్వారకా నగర్ పౌర గ్రంథాలయంలో విశాఖ రత్న సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో ఆల్ ఇండియా రేడియోలో పనిచేసి ఎన్నో అవార్డులు రివార్డులు సాధించిన డాక్టర్ బి జయ ప్రకాష్ దర్శకరత్న దాసరి నారాయణరావు పేరిట జాతీయ ఉగాది పురస్కారాన్ని అందుకున్నారు.

ఈ సందర్భంగా విశాఖరత్న సంస్థ అధినేత భాస్కర్ మాట్లాడుతూ జయ ప్రకాష్ కళామతల్లికి చేసిన సేవలను కొనియాడారు. ముఖ్య అతిధిగా పాల్గొన్న నాగార్జున యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్స్లర్ వి. బాల మోహన్ దాస్ ఆల్ ఇండియా రేడియో కళాకారుడు జయ ప్రకాష్ ను సత్కరించి దర్శకరత్న దాసరి పేరున జాతీయ ఉగాది పురస్కారాన్ని అందించారు. 

ఈ కార్యక్రమంలో ఎస్ ఆర్ టివి ఛానల్ అధినేత సింగంశెట్టి సత్యరాజ్, ఏపీ జానపద కళాకారులు సంఘ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ ఆర్ కృష్ణబాబు, హిందీ పండిట్ డాక్టర్ గడ్డి నాగేశ్వరరావు, హైకోర్టు న్యాయవాది, కట్ట లక్ష్మీ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మోహన్ దాస్ మాట్లాడుతూ దర్శకరత్న దాసరి నారాయణరావుతో ఉన్న జై ప్రకాష్ గల పరిచయాన్ని సభికులకు తెలియజేశారు. ఈ సందర్భంగా జయ ప్రకాష్ ను అభినందించి కొనియాడారు.