*2024-25 రబీ పంట కాలమునకు ధాన్యం సేకరణకు సన్నాహాలు..
*118 రైతు సేవాకేంద్రాలద్వారా కొనుగోళ్లు..
*రబీ ధాన్యం సేకరణపై జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి అధ్యక్షతన జిల్లా ప్రొక్యూర్మెంట్ కమిటీ సమావేశం..
ఏలూరు జిల్లా, ఏలూరు: జిల్లాలో 2024-25 రబీ ధాన్యం కొనుగోలుకు సంబంధిత శాఖలు సమన్వంతో పనిచేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి అన్నారు. సోమవారం స్ధానిక కలెక్టరేట్ గౌతమీ సమావేశ మందిరంలో రబీ ధాన్యం సేకరణపై జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి అధ్యక్షతన జిల్లా ప్రొక్యూర్మెంట్ కమిటీ సమావేశం జరిగింది.
ఈ సందర్బంగా జెసి మాట్లాడుతూ జిల్లాలో రబీ పంటకు సంబంధించి 98 శాతం ఈకెవైసి పూర్తయిందన్నారు. జిల్లాలో 3,97,807 మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పాదక కాగలదని అంచనావేసి 2,,25,000 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించడం లక్ష్యంగా అంచనావేశామన్నారు. జిల్లాలో వరి సాగు చేయుచున్న రైతు పేరును /కౌలు రైతుల యెక్క పేర్లను కూడా ఖచ్చితముగా నమోదు చేయాలన్నారు.
రైతు సేవా కేంద్రాల ద్వారా ధాన్యం విక్రయించుటకు కావలసిన గోనె సంచులను రైస్ మిల్లర్లు ముందస్తుగానే పరిశీలించి మంచి స్థితిలో గల గోనే సంచులను ముందుగానే నిర్దేశించిన గోడౌన్లలో ఉంచుటకు కావలసిన ఏర్పాట్లు చేయాలన్నారు. త్వరతగతిన రవాణా కొరకు వాహనముల యొక్క వివరాలను ఆన్లైన్ నందు నమోదు ప్రక్రియ ప్రారంభించాలన్నారు.
దాన్యం యొక్క నాణ్యత ప్రమాణాలపై, ప్రభుత్వం రైతులకు కల్పించు సౌకర్యములపై అనగా, చెల్లించు ఖర్చు వంటి విషయములను రైతులకు గ్రామ సభల ద్వారా, కరపత్రములు/బ్యానర్లు ద్వారా పూర్తి అవగాహన కల్పించాలన్నారు. ఏప్రిల్ మొదటి వారంలో ధాన్యం రాగలదని అంచనావేయడం జరిగిందన్నారు.
ఈ సమావేశంలో ఆన్ లైన్ ద్వారా నూజివీడు సబ్ కలెక్టర్ బి. స్మరణ్ రాజ్, ఏలూరు, జంగారెడ్డిగూడెం రెవెన్యూ డివిజనల్ అధికారులు అచ్యుత్ అంబరీష్, ఎం.వి. రమణ, జిల్లా పౌర సరఫరాల మేనేజర్ వి. శ్రీలక్ష్మీ, జిల్లా వ్యవసాయ అధికారి హబీబ్ భాషా, డిసివో శ్రీనివాస్, డిఎస్ఓ, జిల్లా అగ్రిబ్రెడ్ మార్కెటింగ్ అధికారి, డి.సి.ఎం.ఎస్ అధికారి, ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ, డివిజనల్ మేనేజర్ - ఎఫ్.సి.ఐ. జిల్లా రవాణా శాఖ డిప్యూటీ కమీషనర్, తూనికలు మరియు కొలతల సహాయ కంట్రోలర్, దాన్యం కొనుగోలు సహాయ ఏజన్సీల జిల్లా అధికారులు మరియు రైస్ మిల్లర్ల సంఘం అద్యకులు పాల్గొన్నారు.
Social Plugin