అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం తీర్మానం
జంగారెడ్డిగూడెం, ప్రతినిధి: వ్యవసాయ రంగాన్ని రక్షించు కోవాలని అఖిల భారత రైతు సంఘం(ఏ ఐ పి కె ఎస్) జాతీయ నాయకుడు కెచ్చల రంగారెడ్డి కోరారు. వ్యవసాయ రంగానికి తగిన ప్రాధాన్యంఇవ్వండం లేదని, కేంద్ర ప్రభుత్వం తగిన బడ్జెట్ కేటాయించడం లేదని నిరసన తెలిపారు. రైతాంగం పండించిన పంటలకు కనీస మద్దతు ధరల చట్టాన్ని చేయాలని అన్నారు. సోమవారం ఇక్కడి రోటరీ క్లబ్ లో జరిగిన రాష్ట్ర స్థాయి సమావేశంలో మాట్లాతూ రంగారెడ్డి.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏఐపీకేఎస్ నాయకత్వాన, రైతాంగ ఉద్యమాన్ని తీవ్ర తరం చేస్తామని, రైతు సంఘంను రాష్ట్రవ్యాప్తంగా బలోపేతం చేస్తామని పేర్కొన్నారు.
అందులో భాగంగా నిర్మాణం చేస్తున్నామని రంగారెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కన్వీనర్ కమిటీని ప్రపాదించగా, ఎస్ కే గౌస్, రామారావు, ముత్యాలరావు, సత్య నారాయణ 4 గురిని ప్రతిపాదించగా, సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. రాష్ట్ర కన్వీనర్ గా ఎస్కే గౌస్ ను ఎన్ను కోవడం జరిగింది. పై ముగ్గురు రాష్ట్ర నాయకులుగా ఎన్నికయ్యారు. గౌస్ తీర్మానాలను ప్రవేశపెట్గా సభ ఆమోదించింది.
సమావేశంలో రాష్ట్ర నాయకులు సిరికొండ రామారావు, గడ్డాల ముత్యాలరావు మాట్లాడారు. ఏపీకేఎస్ జిల్లా అధ్యక్షులు కట్టం వీరాస్వామి, అరుణోదయ జిల్లా నాయకులు కట్టం ముత్యాలరావు, మేడేపల్లి సర్పంచ్ ఎస్ రాంబాబు, నార్లవరం ఎంపీటీసీ కే రత్తమ్మ, తిరుమల పురం సర్పంచ్ విజయ, నార్లవారం సర్పంచ్ ఏం రంగమ్మ, పివో డబుల్యూ డివిజన్ నాయకురాలు ఎస్కే మున్ని, అరుణోదయ కళాకారులు ప్రకాష్, వెంకటేశు, మొదలైనావారు హాజరయ్యారు.
Social Plugin