జంగారెడ్డిగూడెం, ప్రతినిధి: ఈనెల 24 25 26 తేదీల్లో అన్నమయ్య జిల్లా మదనపల్లిలో జరగనున్న ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏ ఐ టి యు సి రాష్ట్ర స్థాయి విద్యా వైజ్ఞానిక శిక్షణా తరగతులు జయప్రదం చేయాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కూనపాముల విగ్నేష్ గౌరవ అధ్యక్షులు జంపన వెంకట రమణ రాజు పిలుపునిచ్చారు.
బుధవారం జంగారెడ్డిగూడెం సిపిఐ కార్యాలయంలో జరిగిన మున్సిపల్ వర్కర్స్ యూనియన్ సమావేశంలో కరపత్రాలు విడుదల చేశారు. ఈ సందర్భంగా విగ్నేష్ మాట్లాడుతూ మున్సిపల్ రంగంలో వస్తున్న మౌలిక మార్పులు పట్ల మున్సిపల్ కార్మికులకు అవగాహన కల్పించడానికి రాష్ట్ర నాయకత్వం శిక్షణ తరగతులు నిర్వహిస్తుందని అన్నారు. ఈ శిక్షణ తరగతులు మున్సిపల్ కార్మికుల విధి నిర్వహణ సమస్యల పరిష్కారం కోసం ఉపయోగపడతాయని పేర్కొన్నారు. మున్సిపల్ వర్కర్స్ కాంటాక్ట్ అవుట్సోరింగ్స్ ఉద్యోగ కార్మికుల సమస్య లపై చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తారని తెలిపారు.
ఎంపిక చేసిన కార్మిక వర్గ ప్రతినిధులకు, నిష్ణాణుతులైన ఉపాధ్యాయులు శిక్షణ ఇస్తారని, అనంతరం శిక్షణ పొందిన ప్రతినిధులు ఆయా జిల్లాల్లో మున్సిపల్ కార్మికులకు అవగాహన కల్పిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పారిశుద్ధ్య విభాగం అధ్యక్ష కార్యదర్శులు కొత్తూరు నాగేశ్వరావు, బొక్క శ్రీనివాసరావు, ఇంగుర్తి నాగరాజు, ఎడవల్లి ప్రసాద్ ,కొత్తూరు ఎమిలేస్, ముప్పిడి సురేష్, పొడుదోలు రమణ, మరియు ఇంజనీర్ విభాగం అధ్యక్ష కార్యదర్శులు కంతేటి వెంకట్రావు, ఎన్ సుబ్బారావు, ఏ ముత్యాలరావు ,నూకరాజు అప్పారావు, దుద్దే ముసలయ్య, వీర్రాజు, తదితరులు పాల్గొన్నారు.
Social Plugin