జంగారెడ్డిగూడెం, ప్రతినిధి: సోషల్ రెస్పాన్స్ బులిటీలో భాగంగా స్థానిక నవభారత్ పామాయిల్ ఫ్యాక్టరీ యాజమాన్యం 6 వేల మంది పాఠశాల విద్యార్థినీ, విద్యార్థుల బస్ పాస్ ల కోసం విరాళంగా రూ. 3లక్షల ఇవ్వడం అభినందనీయమని శాసన సభ్యుడు సొంగా రోషన్ కుమార్ అన్నారు.
ఎమ్మెల్యే చేతులమీదుగా నవభారత్ సంస్థ తమ ప్రతినిధి రాఘవరావు రూ. 3లక్షల చెక్కును బస్ డిపోమేనేజర్ పివి గంగాధర్ కు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోషన్ కుమార్ మాట్లాడుతూ నవభారత్ సంస్థ సోషల్ రెస్పాన్స్ బులిటీలో భాగంగా ప్రతి సంవత్సరం విద్యార్థులకు ఉచితంగా బస్ పాసులు ఏర్పాటు చేయడం సంతోషం అంన్నారు. అలాగే చింతలపూడి అసెంబ్లీ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలకు తమవంతు సహకారాన్ని అందించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో డిపోమేనేజర్ గంగాధర్, సి ఐ వరలక్ష్మి మాట్లాడుతూ 6 వేల మంది పిల్లలు 7, 8వ తరగతుల వరకు బాయిస్,10వ తరగతిలోపు బాలికలకు ఒక్కొక్కరికి రూ. 50,/-లు చొప్పున ఐడి, అప్లికేషన్లకు ఈ మొత్తం సరిపోతుందని వివరించారు.
ఈ కార్యక్రమంలో జనసేన ఇన్చార్జ్ మేకా ఈశ్వరయ్య, జి ఉమా మహేశ్వరి, తెదేపా నాయకులు రావూరి కృష్ణ, మండవ లక్ష్మణరావు, పరిమి సత్తి పండు, దాసరి శేషు, కొండ్రెడ్డి కిషోర్, చేరుకూరి శ్రీధర్, రామలింగేశ్వర రావు, బిజెపి టౌన్ అధ్యక్షుడు కొప్పాక శ్రీనివాసరావు, తదితరులు హాజరయ్యారు.
Social Plugin