జంగారెడ్డిగూడెం, ప్రతినిధి: డివిజన్ కేంద్రం జంగారెడ్డిగూడెంలో మీడియా కమ్యూనిటీ భవన నిర్మాణం కోసం తనవంతుగా రూ. లక్ష రూపాయల విరాళాని ప్రకటించి చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ తమ ఔదార్యాన్ని చాటుకున్నారు. మీడియాకు అన్నివిధాలా సహకారాన్ని అందిస్తామని ఇంటి స్థలాలు, పక్కా ఇళ్ళ మంజూరుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో ఎపి డబ్ల్యూజెఎఫ్ చింతలపూడి నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం అధ్యక్షుడు కాండ్రేగుల చిన్నారావు అధ్యక్షతన జరిగింది.
ముఖ్య అతిథిగా విచ్చేసిన చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ నియోజకవర్గంలో విలేకరుల సమస్యల పరిష్కారానికి తన వంతు సహాయం అందిస్తామని భరోసా ఇచ్చారు. 20 ఏళ్లుగా ప్రభుత్వం ఇచ్చిన స్టలంలో ప్రెస్ క్లబ్ భవనం నిర్మాణం చేయలేదని రాష్ట్ర కార్యదర్శి కె ఎస్ శంకరరావు సమావేశం దృష్టికి తేగా ఎమ్మెల్యే స్పందించారు. తన వంతుగా లక్ష విరాళం ప్రకటించారు. 4 గురు నాయకులుతో భవననిర్మాణం కోసం పర్యవేక్షణ కమిటీ ఏర్పాటు చేశారు. అలాగే ఆకుల రాజేష్ 25 వేలు విరాళాన్ని ప్రకటించారు.
ఈ కార్యక్రమంలో గొల్లమదల శ్రీనివాసరావు స్వాగతం పలికగా, జర్నలిస్టులు ఎమ్మెల్యే ని దుస్సాలువతో పూల దండలతో ఘనంగా సన్మానించారు. జిల్లా ఏపీడబ్ల్యూ జె ఎఫ్ అధ్యక్షుడు ఎస్ డి జబీర్, సీనియర్ జర్నలిస్టులు పి ఎన్వీ రామారావు, రవికిరణ్, లోకేశ్, రాజేష్, కుమార స్వామి, తెదేపా నాయకులు పరిమి సత్తిపండు, మండవ లక్ష్మణ రావు, రావూరి కృష్ణ, గుమ్మడి ప్రసాద్, రామాంజనేయులు, చెరుకూరి శ్రీధర్ జనసేన అధ్యక్షుడు మేకా ఈశ్వరయ్య, SR TV అధినేత సింగంశెట్టి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
Social Plugin