జంగారెడ్డిగూడెం, ప్రతినిధి: స్థానిక మాజీ సొసైటీ అధ్యక్షుడు పరిమి సత్తిపండు జన్మ దినోత్సవ వేడుకలను నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా పోలవరం, చింతలపూడి ఎమ్మెల్యేలు చిర్రి బాలరాజు, సొంగా రోషన్ కుమార్ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా స్ధానిక సుబ్బారెడ్డి కాలనీలోని అమ్మ నాన్న వికలాంగుల సేవాసంస్థలో సత్తిపండు పండ్లు పంపిణీ చేసారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సాయిల సత్యనారాయణ, పట్టణ అధ్యక్షుడు రావూరి కృష్ణ, సీనియర్ నేతలు మండవ లక్ష్మణరావు, గుమ్మడి ప్రసాద్, చెరుకూరి శ్రీధర్, ఐ రామాంజనేయులు, జనసేన నాయకులు గడ్డ మణుగు రవి కుమార్, చింతలపూడి నియోజకవర్గ అధ్యక్షుడు మేకా ఈశ్వరయ్య, మండల అధ్యక్షుడు ఆకుల రాకేష్, పట్టణ అధ్యక్షుడు పీరూ సాహెబ్, వీర మహిళ గురుజు ఉమామహేశ్వరి, మున్సిపల్ కౌన్సిలర్లు కరుటూరి రమాదేవి, తెలగారపు జ్యోతి, రాష్ట్ర కార్యదర్శి పగడం సౌభాగ్యవతి తదితరులు పాల్గొన్నారు.
Social Plugin