ఏలూరు, ప్రతినిధి: జిల్లా ప్రజా పరిషత్ స్థాయి సంఘం సమావేశం జడ్పీ ఛైర్పర్సన్ ఘంటా పద్మశ్రీ అధ్యక్షతన సోమవారం జడ్పీ సమావేశ మందిరంలో జరిగింది. ఈ సమావేశానికి హాజరైన అధికారులు ఎన్నికల ప్రవర్తన నియామవాళిని దృష్టిలో ఉంచుకొని శాఖల వారీగా ప్రగతి నివేదిక వివరించారు. ఎలక్షన్ మోడల్ కోడ్ ఉన్నందున ఎటువంటి విధాన పరమైన నిర్ణయాలు తీసుకోకుండానే సమావేశం ముగించారు. మొదటి స్థాయి సంఘం ప్రణాళిక, ఆర్ధిక అంశాలపై జరుపగా వేసవిని దృష్టిలో ఉంచుకొని త్రాగునీటి ఎద్దడిఫై జిల్లా యంత్రాంగం తీసుకున్న ముందస్తు చర్యలపై అధికారులు స్థాయి సంఘం సభ్యుల దృష్టికి తీసుకొచ్చారు.
అనంతరం సమావేశాన్ని ముగిస్తూన్నట్టు ఛైర్పర్సన్ ఘంటా పద్మశ్రీ తెలపగా సమావేశానికి హాజరైన అధికారులు వెళ్ళడానికి సిద్దపడగా అంతలో జిల్లా గ్రామ పంచాయతీ అధికారి తూతిక శ్రీనివాస విశ్వనాధ్ జడ్పీ ఛైర్పర్సన్ ఉద్దేశించి అనుమతి కోరగా అదేస్థాయిలో 'ఎస్ ప్లీజ్' అని బదులు రావడంతో అధికారులు అందరు ఏమిటా? అని డీపీఓ వైపు చూసారు.. తాను జిల్లా స్వీప్ నోడల్ ఆఫీసర్ అని జిల్లాలో ఇప్పటివరకు 2000 స్వీప్ కార్యక్రమాలు పట్టణాలలో, గ్రామాలలో చేపట్టడం జరిగిందని డీపీఓ శ్రీనివాస విశ్వనాధ్
తెలిపారు.. ఆయన మాట్లాడుతూ గత ఎన్నికలలో జిల్లా పోలింగ్ శాతం 83.10% అని రాబోవు సార్వత్రిక ఎన్నికలలో 92% లక్ష్యం పెట్టుకొని ఓటింగ్ పెంచే విధంగా అన్ని చర్యలు చేపడుతున్నామని అన్నారు.
85 సంవత్సరాలు ఫైబడిన వారికీ, దివ్యంగుల కోసం ఎన్నికల సంఘం ఆదేశాలు మేరకు హోమ్ ఓటింగ్ జరుపనున్నామని అన్నారు. జిల్లాలో అత్యల్పంగా 68.54% పోలింగ్ నమోదు గత ఎన్నికలలో ఏలూరు నియోజకవర్గంలో జరిగిందని దీనికి ప్రధాన కారణం ఈ నియోజకవర్గంలో ఓటరుగా నమోదైనవారు ఇతర ప్రాంతాలలో ఉద్యోగాలు చేయడం, చదువులు నిమిత్తం దూర ప్రాంతాలలో ఉండడం వలన పోలింగ్ రోజు ఓటుహక్కు వినియోగించుకోవడం లేదన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు ఓటు ద్వారా జరుగుతుందని, సమాజ అభివృద్ధికి, వ్యక్తి భవిషత్తుకు ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు.
పవిత్రమైన ఓటును నగదుకు, బహుమతులకు అమ్ముకోకూడదని ప్రతి ఓటరు ఏథికల్ ఓటింగులో భాగస్వాములు కావాలని అన్నారు. జిల్లాలో ఉన్న 16.25 లక్షల ఓటర్లను దృష్టిలో ఉంచుకొని ఓటరు చైతన్య కార్యక్రమాలలో భాగంగా అన్ని పంచాయతీలలో కళాజాత కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ఆదేశాలు మేరకు దూరప్రాంతాలలో ఉన్న ఓటర్లకు అమ్మ పిలుస్తుంది అనే సామజిక చైతన్య కార్యక్రమంలో భాగంగా ఆహ్వానపత్రిక పంపి ఓటింగు ప్రక్రియలో భాగస్వామ్యం చేయడం జరుగుతుందని డీపీఓ శ్రీనివాస విశ్వనాధ్ అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈఓ సుబ్బారావు, జిల్లాస్తాయి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధికారులు పాల్గొన్నారు.
Social Plugin