Ticker

6/recent/ticker-posts

జిల్లాలో ఇంతవరకు 873 మంది రైతుల నుంచి రూ 15.65 కోట్ల విలువైన 10,442 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు


జిల్లా స్థాయిలో కంట్రోల్ రూమ్ నెంబర్లు 08812-230448, 7702003584, 7569562076, 7569597910

జిల్లా జాయింట్ కలక్టర్ బి లావణ్య వేణి

ఏలూరు కలెక్టరేట్: ఏలూరు జిల్లాలో ప్రస్తుత రబి పంటకు సంబంధించి ఇంతవరకు 873 మంది రైతుల వద్ద నుండి రూ.15.65 కోట్ల విలువైన 10,442.520 మెట్రిక్ టన్నుల ధాన్యం ఆన్లైన్ ద్వారా కోనుగోలు చేసి, అనుసంధానము చేయబడిన రైస్ మిల్లులకు రాండమ్ సెలెక్షన్ ద్వారా తరలించడం జరిగిందని జిల్లా జాయింట్ కలక్టర్ బి లావణ్య వేణి తెలిపారు.  

ధాన్యం కొనుగోళ్ళు ప్రక్రియ ప్రారంభించబడి ఇప్పటి వరకు 2,751 మంది రైతులకు చెందిన 27,356 మెట్రిక్ టన్నుల ధాన్యం విక్రయించుటకు నమోదు చేసుకోవడం జరిగిందన్నారు. కనీస మద్ధతు ధరకు రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేయుటకు ఏలూరు జిల్లాలో 120 ఆర్ బి కె లలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు 66 కొనుగోలు సహాయక కేంద్రాల ద్వారా తగు సిబ్బందితో మరియు అవసరమగు అన్ని సౌకర్యములతో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా జరుగుట కొరకు జిల్లా యంత్రాంగం క్షేత్ర స్ధాయి పర్యవేక్షణ నిమిత్తం మండలాల వారీగా ప్రత్యేక అధికారులను నియమించడం జరిగిందన్నారు. క్షేత్ర స్ధాయి పర్యవేక్షణ అధికారులు ఎప్పటికప్పుడు సంబందిత మండలాలకు స్వయంగా వెళ్ళి రైతులు ఎదుర్కుంటున్న సమస్యలను పరిష్కరిస్తూ ధాన్యం కొనుగోళ్లు సజావుగా జరిగేలా పూర్తి స్ధాయిలో పనిచేయడం జరుగుతుందన్నారు. 

ధాన్యం కొనుగోలు ప్రక్రియ సమయంలో వచ్చు రైతుల ఫిర్యాదులను స్వీకరించుటకు మరియు పరిష్కరించుటకు జిల్లా స్థాయిలో కంట్రోల్ రూమ్ నెంబర్లు 08812-230448, 7702003584, 7569562076, 7569597910 ఏర్పాటు చేశామన్నారు. కావున రైతులందరికి తెలియచేయునది ఏమనగా తమ ధాన్యం కోతలు అయిన తరువాత ఆరబెట్టుకొని సుమారుగా తేమ శాతం 16 నుండి 17 వరకు ఉండు విధముగా చూచుకొని మరియు ధాన్యములో తాలు, తప్పలు మొదలైన వ్యర్ద పదార్దములు లేకుండా ప్రభుత్వము నిర్ధేశించిన అన్ని నాణ్యతా ప్రమాణములకు అనుగుణముగా సిధ్దం చేసుకొని కనీస మద్దతు ధరకు అనగా క్వింటాలుకు కామన్ రకమునకు రూ. 2183/- మరియు గ్రేడ్–ఎ రకమునకు రూ. 2203/- బయోమెట్రిక్ విధానములో తమ వేలిముద్రను వేసి ప్రభుత్వము వారికి విక్రయించుకోవచ్చుని తెలిపారు.