Ticker

6/recent/ticker-posts

అక్కంపేటలో ప్రాథమిక పాఠశాలలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 133వ జయంతి ఉత్సవాలు


జంగారెడ్డిగూడెం-ప్రతినిధి: మండలంలోని అక్కంపేటలో ప్రాథమిక పాఠశాలలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 133వ జయంతి ఉత్సవాలు పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన గ్రామ సర్పంచ్ పారేపల్లి నాగేంద్రబాబు మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగ ఫలాలు అందరికీ సమానంగా పంచిన మహానీయుడని కొనియాడారు. అలాగే ప్రతి ఒక్కరు అంబేద్కర్ బాటలో పయనించాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గంధం గోపాలకృష్ణ, కాజా వెంకటేశ్వరరావు నులకాని సూరిబాబు, పారేపల్లి గంగారామ్, బాలం బుజ్జి, నులకాని సుబ్రమణ్యం, పింగళి శ్రీనివాస్, తారిపురెడ్డి రామకృష్ణ, నులకాని రామకృష్ణ తోమ్ముండ్రు వెంకటేశ్వరరావు, గొల్లమందల కేశవ, రామకృష్ణ పాల్గొన్నారు.

అంబేద్కర్ గొప్ప దార్శనికుడు -గొల్లమందల

ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన గొల్లమందల శ్రీనివాస్ మాట్లాడుతూ అంబేడ్కర్ ఆలోచనా విధానాలతో ప్రతి ఒక్కరు అభివృద్ధి చెందాలని, యువత అంతా అంబేద్కర్ బాటలో నడవాలని పిలుపునిచ్చారు. అలాగే డాక్టర్ అంబేద్కర్ బోధించు, సమీకరించు, పోరాడు అనే సూక్తులతో రాజ్యాంగం రూపొందించిన మహానుభావుడు అన్నారు. అంబేడ్కర్ అని వ్యక్తి రాజ్యాంగం రాయడం వల్లనే ఎన్నో ఫలాలు పొందుతున్నామని కృతజ్ఞతలు తెలిపారు. ఆయన రాసిన రాజ్యాంగం ద్వారానే మన దేశ చట్టాలు రూపొందించారని పేర్కొన్నారు. ఆటు వంటి మహానుభావులందరికి
మనం అందరం రుణపడి వున్నామని శ్రీనివాసరావు కృతజ్ఞతలు తెలిపారు. ప్రపంచ మేధావుల సరసన నిలబడే అర్హత అంబేద్కర్ కి ఉందని అదే మన జాతికి గర్వించదగ్గ విషయం అన్నారు.