జంగారెడ్డిగూడెం, ప్రతినిధి: ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలోని బుట్టాయిగూడెం రోడ్ లో శ్రీ సీతారామస్వామి వారి ఆలయంలో స్వామివారి బ్రహ్మో త్సవాలు ఈ నెల 16వ తేదీ బుధవారం నుంచి 19వ తేదీ శనివారం వరకు నిర్వహించనున్నట్టు కార్య నిర్వాహణాధి ఆకుల కొండలరావు సోమవారం తెలిపారు.
భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాలు విజయ వంతం చెయ్యాల్ని విజ్ఞాన చేశారు. 16వ తేదీ బుదవారం ఉదయం.7.00 గంటలకు స్వామివారి పంచామృతస్నపన పూజాకార్యక్రమాలతో బ్రహ్మమోత్సవాలు మొదలౌతాయని, 8.30 గంటలకు స్వామిని పెళ్లి కుమారుని చేయుట, అమ్మవారిని పెళ్లి కుమార్తెను చేయుట జరుగుతాయని తెలిపారు. సాయంత్రం 6.00 లకు విష్ణు సహస్రనామ పారాయణం, రాత్రి 10.30 గంటలకు ద్వజపట ప్రతిష్ట – ద్వజారోహణ నిర్వహించనున్నారు.
17వ తేదీ గురువారం ఉదయం 5.00 గం లకు సుప్రభాతసేవ, 5.30 కి పూజాకార్యక్రమాలు, 8.30 కి శ్రీస్వామివారి గ్రామోత్సవం, 10.30 కి స్వామి వారి కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా జరిపించాలని నిర్ణయించడం జరిగింది. 8వ తేదీ శుక్రవారం రాత్రి 8.30 గంలకు శ్రీపుష్పయాగం పవళింపుసేవ వుంటాయని తెలిపారు. చివరి రోజు 19తేదీ శనివారం ఉదయం 11.00 గంటల నుండి అన్నసమారాధన, తదుపరి అనంతరం ఊరేగింపు నిర్వహించనున్నట్టు ఈఓ కొండలరావు తెలిపారు.
Social Plugin