జంగారెడ్డిగూడెం-ప్రతినిధి: స్థానికి పారిజాత వృక్షాలు నడుమ కొలువై ఉన్న శ్రీవెంకన్న స్వామిని పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. స్వామివారికి ప్రీతికరమైన రోజు శనివారం కావడం విద్యార్థులకు పరీక్షలు పూర్తి అయ్యి ఫలితాలు వెలువడటంతో వారంతా
మొక్కులు చెల్లించారు.
తెల్లవారు జామున సుప్రభాత సేవ ఆరాధన తోమాలసేవ తీర్ధప్రసాదగోష్ఠి అనంతరం భక్తులకు దర్శనమిచ్చారు. ప్రధానార్చకులు తొలి పూజ అనంతరం భక్తులకు అవకాశం ఇచ్చారు. జిల్లా నలుమూలల నుండి విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఇంటర్ పరీక్షలు ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు శ్రీస్వామి వారి ఆలయం చుట్టూ 108 ప్రదక్షిణలు చేసి మొక్కుబడులు చెల్లించి కున్నారు. అధిక సంఖ్యలో వచ్చిన భక్తులకు అన్నప్రసాదవితరణ దాతలు మామిళ్లపల్లి సత్తిబాబు, భవానీ, గన్నమనేని వెంకటరాజేష్ (ముప్పినవారిగూడెం) గ్రామస్తులు జరిపించారని ఈ ఓ మానికల రాంబాబు తెలిపారు.
Social Plugin