Ticker

6/recent/ticker-posts

చరిత్రలో తొలిసారి, 12 అణు వార్‌హెడ్లను మోహరించిన భారత్..


INDIA NEWS, JUN 09: అణు ఆయుధ విధానంలో భారత్ స్పష్టమైన మార్పు చేసినట్లు తెలుస్తోంది. భారత్ తొలిసారిగా 12 అణు వార్‌హెడ్‌లను మోహరించినట్లు స్టాక్‌హోమ్ అంతర్జాతీయ శాంతి పరిశోధనా సంస్థ (SIPRI) తన తాజా నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది. దశాబ్ధాలుగా అణ్వాయుధాలను, వాటిని ప్రయోగించే వ్యవస్థలను వేర్వేరుగా ఉంచే విధానాన్ని భారత్ అవలంభిస్తోంది. కానీ తాజా నివేదిక ప్రకారం, భారత్ ప్రయోగించే స్థితిలో అణు ఆయుధాలను ఉంచినట్లు తెలుస్తోంది.


భూగర్భ క్షిపణి స్థావరాలలో, కొత్త అణు జలాంతర్గాములలో ప్రయోగించడానికి సిద్ధంగా ఉన్న అణ్వాయుధాలను మోహరించినట్లు నివేదిక వెల్లడించింది. ఇది దేశ అణ్వాయుధ సంసిద్ధతను సూచిస్తోంది. ఇప్పటి వరకు భారత్ శాంతికాలంలో అణు వార్‌హెడ్లను క్షిపణుల నుంచి వేరే చేసి భద్రపరస్తుందనే అభిప్రాయం ఉండేది. అయితే, ఇటీవల క్షిపణులను కానిస్టర్లలో నిల్వ చేయడం, అణు సామర్థ్యం కలిగిన జలంతర్గాముల్లో మోహరించడం వంటివి చేసిందని నివేదిక చెప్పింది.

ఇదిలా ఉంటే, భారత్ అణు విధానంలో ‘‘నో ఫస్ట్ యూజ్’’ పాలసీని కొనసాగిస్తోంది. భారత్ ఎప్పటికి ఎవరిపై కూడా ముందుగా అణు దాడి చేయదు. ఒక వేళ భారత్ భూభాగం, భారత సైన్యంపై అణు దాడి జరిగితే మాత్రమే ప్రతీకార చర్యగా అణ్వాయుధాలను ఉపయోగిస్తుంది. మరోవైపు, భారత్ తన అణ్వాయుధాల నిల్వను పెంచుకున్నట్లు నివేదిక వెల్లడించింది. భారత్ వద్ద జనవరి 2026 నాటికి 190 అణ్వాయుధాలు ఉన్నట్లు అంచనా వేసింది. ఇది పాకిస్తాన్ కన్నా ఎక్కువ అని చెప్పింది.