Ticker

6/recent/ticker-posts

శ్రీకాకుళంలో జగన్ పర్యటన పూర్తి షెడ్యూల్.. పోలీసుల కఠిన ఆంక్షలు..!


ANDRAPRADESH, SRIKAKOLAM, JUL, 30: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. ప్రస్తుతం అంపోలు జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును ఆయన జైలులో ములాఖత్ ద్వారా పరామర్శించనున్నారు. ఎన్నికల అనంతరం జగన్ శ్రీకాకుళం జిల్లాకు రావడం ఇదే తొలిసారి కావడంతో వైసీపీ శ్రేణులు ఈ పర్యటనకు ప్రాధాన్యం ఇస్తున్నాయి.


అయితే, సీదిరి అప్పలరాజు కుమారుడు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటనలో, కుమారుడిని కేసు నుంచి తప్పించేందుకు ప్రయత్నించారనే ఆరోపణలపై పోలీసులు అప్పలరాజును అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన శ్రీకాకుళం జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో జగన్ ఆయనను పరామర్శించనున్నారు. అయితే, వైఎస్‌ జగన్ పర్యటన సందర్భంగా విశాఖపట్నం నుంచి జాతీయ రహదారి మార్గంలో శ్రీకాకుళం చేరుకోనున్నారు. భోగాపురం, పూసపాటిరేగ, పైడి భీమవరం, రణస్థలం, ఎచ్చెర్ల మీదుగా అంపోలు జిల్లా జైలుకు చేరుకుని మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల వరకు అప్పలరాజుతో ములాఖత్ నిర్వహించనున్నారు.

అయితే, వైఎస్‌ జగన్‌ పర్యటన నేపథ్యంలో ఆంక్షలు విధించారు పోలీసులు.. జైలు వద్ద ములాఖత్‌కు మాత్రమే పోలీసులు అనుమతి ఇచ్చారు. ర్యాలీలు, భారీ జనసమీకరణకు అనుమతి లేదని శ్రీకాకుళం పోలీసులు స్పష్టం చేశారు. గతంలో క్రౌడ్ గ్యాదరింగ్‌ల సమయంలో చోటుచేసుకున్న ఘటనలు, ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన, శాంతిభద్రతల అంశాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు..

వైఎస్‌ జగన్ పర్యటన షెడ్యూల్
* ఉదయం 9:00 గంటలకు – తాడేపల్లి నుంచి గన్నవరం విమానాశ్రయానికి బయలుదేరు
* 9:30 గంటలకు – గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్నారు
* 9:45 గంటలకు – విమానంలో విశాఖపట్నంకు బయలుదేరుతారు
* 10:45 గంటలకు – విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకుంటారు
* 11:00 గంటలకు – రోడ్డు మార్గంలో శ్రీకాకుళం జిల్లాకు ప్రయాణం ప్రారంభం
* మార్గం: భోగాపురం → పూసపాటిరేగ → పైడి భీమవరం → రణస్థలం → ఎచ్చెర్ల
* మధ్యాహ్నం 2:00 గంటలకు – అంపోలు జిల్లా జైలుకు చేరుకుంటారు
* 2:00–3:00 గంటల వరకు – మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుతో జైలులో ములాఖత్
* 3:00 గంటలకు – జైలు నుంచి విశాఖపట్నంకు బయలుదేరుతారు
* సాయంత్రం 5:30 గంటలకు – విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకుంటారు
* 5:50 గంటలకు – తిరుగు ప్రయాణం అవుతారు..