ANDRAPRADESH, MAY 25: వైసీపీ నాయకుడు గురించి అమిత్ షా దగ్గర ఏమీ మాట్లాడలేదని.. అయినా అమిత్ షాతో ఏకాంతంగా జరిగిన చర్చలు బయటకు ఎలా తెలుస్తాయని జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. రాజమండ్రిలో జరిగిన జనసేన సమావేశంలో పవన్ కల్యాణ్ మాట్లాడారు. ‘‘రాజకీయ పార్టీ నడపడం అంత ఈజీ కాదు. కులం గురించి మాట్లాడతానని నన్ను అంటున్నారు.
మిగితా నాయకులు కులం గురించి మాట్లాడటం లేదా.? గత్యంతరం లేక.. ఇంత ఓపికతో ఉన్నా.. తమిళనాడు రాజకీయాలు ఎంతో సాఫీగా సాగిపోయాయి. నాకు అసూయ కలిగేంత చక్కగా రాజకీయాలు సాగాయి.’’ అని పవన్ కల్యాణ్ అన్నారు. ‘‘అమిత్‌షాతో మాట్లాడిన విషయాలు బయటవాళ్లకు ఎలా తెలుస్తాయి.
వైసీపీ నేత జైలుకు వెళ్లాలని అడిగితే నాకు క్లాస్ తీసుకున్నారట. ఒకరు జైలుకి వెళ్తే పవన్ కల్యాణ్ ఎదుగుతారా.? జనసేన ఎదుగుతుందా..? ఇలాంటి వారు లేనప్పుడే నేను రాజకీయాల్లోకి వచ్చా.’’ అని అన్నారు.

