Ticker

6/recent/ticker-posts

రైతులను గాలికొదిలేసిన చంద్రబాబు ప్రభుత్వం: కారుమూరి సునీల్ కుమార్


ఏలూరు, మే 9: కారుమూరి సునీల్ కుమార్ రాష్ట్రంలోని రైతులను చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. శనివారం జంగారెడ్డిగూడెంలో మొక్కజొన్న రైతులను పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.


ఈ సందర్భంగా కారుమూరి సునీల్ కుమార్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో రైతులకు అనేక హామీలు ఇచ్చిన ప్రభుత్వం, అధికారంలోకి వచ్చిన తర్వాత వారి సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమని అన్నారు.

మొక్కజొన్న రైతులు ఎకరాకు రూ.30 వేల వరకు పెట్టుబడి పెట్టి పంట సాగు చేస్తున్నారని, అయితే ప్రస్తుతం గిట్టుబాటు ధర కూడా దక్కక రైతులు తీవ్ర నష్టాల్లో కూరుకుపోయారని పేర్కొన్నారు. రైతుల పరిస్థితిని ప్రభుత్వం వెంటనే గుర్తించి కనీస మద్దతు ధర కల్పించడంతో పాటు మార్కెట్‌లో స్థిరమైన ధరలు ఉండేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

రైతు వ్యతిరేక విధానాలతో ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించిన ఆయన, రైతుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. రైతులకు అండగా వైఎస్ఆర్సీపీ ఎప్పుడూ నిలుస్తుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి జెట్టి గురునాధం, స్థానిక పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు రైతులు పాల్గొన్నారు.