Ticker

6/recent/ticker-posts

ఐఎఫ్‌డబ్ల్యూజే రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్‌గా టీ రాజేష్, కార్యదర్శిగా అబ్దుల్ షుకూర్ నియామకం


ఏలూరు, మే 6: ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (IFWJ) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్‌గా టీ రాజేష్, రాష్ట్ర కార్యదర్శిగా అబ్దుల్ షుకూర్‌ను ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు Pamarthi Ramakrishna నియమించారు. నియామక పత్రాలను ఆయన చేతుల మీదుగా అందజేశారు.


ఈ సందర్భంగా పామర్తి రామకృష్ణ మాట్లాడుతూ 144 సంవత్సరాల చరిత్ర కలిగిన ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ జర్నలిస్టుల హక్కుల సాధన కోసం నిరంతరం పోరాటం చేస్తోందన్నారు. జర్నలిస్టుల సంక్షేమం, రక్షణ చట్టం అమలు, రైల్వే పాస్‌ల పునరుద్ధరణ వంటి అంశాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి సమస్యలను తీసుకెళ్తున్నామని తెలిపారు.

ఈ ఏడాది మార్చి 28న మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని అమర్‌కంటక్, అనుపూర్ జిల్లాలో జాతీయ అధ్యక్షుడు Avadhesh Bhargava అధ్యక్షతన జరిగిన 144వ జాతీయ వర్కింగ్ కమిటీ సమావేశంలో పలు కీలక తీర్మానాలు ఆమోదించబడినట్లు తెలిపారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం ఉదయం ధ్వని పత్రిక ఎడిటర్ టీ రాజేష్, సీనియర్ జర్నలిస్టు అబ్దుల్ షుకూర్ సమర్థవంతంగా పనిచేస్తారనే నమ్మకంతో ఈ బాధ్యతలు అప్పగించినట్లు పేర్కొన్నారు.

నూతనంగా బాధ్యతలు స్వీకరించిన టీ రాజేష్, అబ్దుల్ షుకూర్ మాట్లాడుతూ తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని తెలిపారు. జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ, సంక్షేమం కోసం కృషి చేస్తామని, రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టుల సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపడుతున్నామని వెల్లడించారు. ఆసక్తి ఉన్న జర్నలిస్టులు 9951242599, 9391455803 నంబర్లను సంప్రదించాలని కోరారు.