Ticker

6/recent/ticker-posts

ఏర్పాట్లను త్వరగా పూర్తిచేయాలి


డోన్‌ టౌన్‌మండలంలోని కొత్తబురుజు గ్రామంలో జరిగే సీఎం సభ ఏర్పాట్లను త్వరగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కొత్తబురుజులో గ్రామ సభ స్థలం, హెలిప్యాడ్‌, కార్యకర్తల సమావేశ ప్రాంగణాన్ని ఆయనతో పాటు కలెక్టర్‌ రాజకుమారి, జేసీ కార్తీక్‌, ఎస్పీ సునీల్‌ షెరాన్‌ పరిశీలించారు. 

ఈ సందర్బంగా అధికారులు, నిర్వాహకులతో ఎమ్మెల్యే మాట్లాడారు. కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యే అవకాశం ఉన్నందున తగిన సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. 

సీఎం పర్యటన విజయవంతం చేసేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసికట్టుగా పనిచేయాలన్నారు. సభకు హాజరయ్యే ప్రజలకు తాగునీరు, మౌలిక వసతులు కల్పించాలని కోరారు.