Ticker

6/recent/ticker-posts

నిమ్మనపల్లె సొసైటీలో భారీస్కామ్‌..!


మదనపల్లె: నకిలీ బంగారంపై రుణాల మంజూరు మచ్చ మాయక ముందే..అదే సహకార సొసైటీలో మరో భారీస్కామ్‌ వెలుగులోకి వచ్చింది. రైతులు, ప్రజల సొత్తుకు కాపలాగా, అంతకు మించీ జవాబుదారీగా ఉండాల్సిన అధికారే చేతివాటం ప్రదర్శించారు. రూ.లక్ష కాదు..రూ.కోటి కాదు..ఏకంగా రూ.2కోట్లకుపైగా స్వాహా చేశారు. 


తర్వాత తమకేమీ తెలినట్లు సైలెంట్‌గా ఉండిపోయారు. బంగారం తాకట్టుపై ఆ సొసైటీ.. రైతులు, ప్రజలకు రుణాలు ఇచ్చింది. తమ అవసరాలు తీరిపోయాక..రైతులు, కస్టమర్లు తాము తీసుకున్న అప్పునకు వడ్డీతో సహా సొసైటీకి చెల్లించి, తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించుకున్నారు. 

అంతవరకూ బాగానే వుంది. ఈ సొమ్మును సొసైటీ ఖాతాలో జమ చేయాల్సివుండగా, సీఈవో స్వాహా చేశారు. అయితే క్యాష్‌బుక్‌లో ఎంట్రీ, ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. కానీ బ్యాంకు ఖాతాలో జమ కాలేదు. అనుమానం వచ్చిన నోడల్‌ అధికారి విచారణలో చేస్తే అసలు విషయం వెలుగులోకి వచ్చింది. మరింతలోతుగా వెళ్తే, రూ.2కోట్ల కుంభకోణం వెలుగులోకి వచ్చింది.