రాజమహేంద్రవరం: సీతానగరం మండలం పరిధిలోని బొబ్బిల్లంక గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. భార్యను అతికిరాతంగా చంపాడు ఓ భర్త. అడ్డొచ్చిన అత్తను సైతం కత్తితో నరికి చంపాడు.
పోలీసుల వివరాల ప్రకారం, ప్రేమించి వివాహం చేసుకున్న భార్య లతతో కుటుంబ కలహాల కారణంగా సోడదాసి పండు అనే వ్యక్తి అలియాస్ సీతారామరాజు వేరుగా జీవిస్తున్నాడు, కొంతకాలంగా భార్యాభర్తలు విభేదాల కారణంగా దూరంగా ఉంటున్నారు. లత కొంతకాలం కోటి కేశవరం గ్రామంలో తన చెల్లెలి ఇంటి వద్ద నివసించింది. ఇటీవల తిరిగి తల్లి వద్దకు వచ్చిన నేపథ్యంలో గత రాత్రి ఆమెపై దాడికి దిగాడు. అడ్డుకునేందుకు వచ్చిన అత్త లక్ష్మీపై కూడా కత్తితో దాడి చేశాడు. తీవ్ర గాయాలతో తల్లి, కూతురు రక్తపు మడుగులోనే కొట్టుమిట్టాడుతూ ప్రాణాలు కోల్పోయారు.
సమాచారం అందుకున్న సీతానగరం పోలీస్ స్టేషన్ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడిపై గతంలో కూడా నేరచరిత్ర ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.



.jpeg)