కొండపల్లి/విజయవాడ: కొండపల్లి మున్సిపాలిటీలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో వసంత వెంకట కృష్ణ ప్రసాదు శనివారం సాయంత్రం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ Ramadan మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందని అన్నారు.
పవిత్ర రంజాన్ మాసంలో ముస్లింలు వేకువజామునే ఉపవాస దీక్ష చేపట్టి, ప్రవక్త మొహమ్మద్ బోధించిన మార్గంలో అల్లాహ్‌ను ఆరాధిస్తూ రోజంతా నియమ నిబద్ధతతో ఉపవాసం పాటిస్తారని తెలిపారు. సాయంత్రం ఉపవాసాన్ని విరమించే సమయాన్ని ఇఫ్తార్‌గా పిలుస్తారని వివరించారు.
రోజా సమయానికి అక్కడికి చేరుకున్న ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు ముస్లిం సోదరులతో కలిసి ఉపవాస దీక్షను విరమింపజేశారు. వారికి పండ్లు తినిపించి ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో కూడా ఆయన పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు మరియు స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.



.jpeg)