భీమడోలు మండలం, ఏలూరు, మార్చి 8: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని భీమడోలు కాంపు కార్యాలయంలో తెలుగు మహిళా ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కేక్‌ను కట్ చేసి మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మహిళలకు నూతన వస్త్రాలు బహుకరించి దుశ్శాలువాలతో సత్కరించి మిఠాయిలు పంచారు.
ఈ సందర్భంగా నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలను మహిళలు ఆసక్తిగా తిలకించారు. మహిళలు రాజకీయంగా, ఉద్యోగరీత్యా మరియు సమాజంలోని అన్ని రంగాలలో రాణించాలని ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు ఆకాంక్షించారు.



.jpeg)