మండల, డివిజనల్, మున్సిపల్ స్థాయిలకు పీజీఆర్ఎస్ విస్తరణ
ఏలూరు, మార్చి 1: ప్రజా ఫిర్యాదుల పరిష్కారాన్ని మరింత వేగవంతంగా, ప్రజలకు చేరువ చేయడం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (PGRS) సేవలను మండల, డివిజనల్ మరియు మున్సిపల్ స్థాయిల్లో కూడా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి తెలిపారు. ఈ నెల 2వ తేదీ సోమవారం (02-03-2026) పీజీఆర్ఎస్ కార్యక్రమం యథావిధిగా కొనసాగుతుందని వెల్లడించారు.
జిల్లా స్థాయిలో ఏలూరు కలెక్టరేట్‌లోని గోదావరి సమావేశ మందిరంలో సోమవారం ఉదయం 10 గంటల నుంచి పీజీఆర్ఎస్ మరియు రెవిన్యూ క్లినిక్ కార్యక్రమాలు నిర్వహించబడతాయని తెలిపారు.
ఇప్పటివరకు జిల్లా స్థాయిలో మాత్రమే అమలవుతున్న ఫిర్యాదుల స్వీకరణ వ్యవస్థను ప్రభుత్వం వికేంద్రీకరించిందని, ఇకపై ప్రజలు తమ ఫిర్యాదులను సమీప మండల కార్యాలయాలు, డివిజనల్ కార్యాలయాలు లేదా మున్సిపల్ కార్యాలయాల్లో నేరుగా సమర్పించుకోవచ్చని తెలిపారు.
అలాగే ఇంటి నుంచే ఆన్‌లైన్ ద్వారా ఫిర్యాదులు నమోదు చేసుకునేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన అధికారిక వెబ్‌సైట్ https://meekosam.ap.gov.in
ను వినియోగించుకోవచ్చన్నారు.
ఫిర్యాదు నమోదు, ఫిర్యాదుల స్థితి వంటి వివరాలు తెలుసుకోవడానికి 1100 టోల్ ఫ్రీ నంబర్ కు కాల్ చేయవచ్చని సూచించారు.
ఈ వ్యవస్థ ద్వారా ప్రజల సమస్యలు తక్షణమే సంబంధిత అధికారులకు చేరి సమయానుకూలంగా పరిష్కారమవుతాయని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.


.jpeg)
