Ticker

6/recent/ticker-posts

"మన శంకర వరప్రసాద్ గారు" చిత్రం విడుదల సందర్భంగా ఏలూరులో మెగా సంబరాలు..


ముఖ్య అతిథులుగా హాజరైన ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, ఆర్టీసీ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పల నాయుడు, జనసేన నాయకులు నారా శేషు..


ఏలూరు, జనవరి 12: మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన మన శంకర వరప్రసాద్ గారు చిత్రం విడుదల సందర్భంగా మెగా అభిమానులు ఘనంగా సంబరాలు నిర్వహించారు.. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా టిడిపి అధ్యక్షులు, ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య చంటి, ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ ఏలూరు నియోజకవర్గ ఇన్చార్జి రెడ్డి అప్పలనాయుడు, జనసేన నాయకులు నారా శేషు మరియు కూటమి నాయకులు మెగాస్టార్ చిరంజీవి అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.. 

నగరంలోని సత్యనారాయణ థియేటర్ మరియు విజయలక్ష్మి థియేటర్ వద్ద కేక్ కట్ చేసి పటాసులు కాల్చుతూ జై చిరంజీవ అనే నినాదాలతో అభిమానులు తో కలిసి ఆనందోత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి నటించిన "మన శంకర వరప్రసాద్ గారు" ఈ సంక్రాంతికి ప్రేక్షకుల హృదయాలను ఆకట్టుకొని ఘనవిజయం సాధించాలని ఆకాంక్షించారు. మెగాస్టార్ చిరంజీవి సినిమాలు ఎప్పటికీ ప్రజల ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోతాయని, ఆయనకు ఉన్న అభిమానుల ప్రేమే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. 

కుటుంబ సమేతంగా ప్రతి ఒక్కరూ ధియేటర్ కు వెళ్లి ఈచిత్రాన్ని వీక్షించాలన్నారు. కార్యక్రమం మొత్తం ఉత్సాహభరిత వాతావరణంలో సాగింది.. ఈ కార్యక్రమంలో ఏలూరు మెగా ఫ్యాన్స్ గౌరవ అధ్యక్షులు మారం హనుమంతరావు (అను), నగర పట్టణ చిరంజీవి ఫ్యాన్స్ అద్యక్షులు శానం శ్రీ రామకృష్ణమూర్తి, మెగా అభిమానులు పి.సురేష్, పి.జగన్, డి.పెదబాబు, ఈ. పవన్, కట్టా ఆది,టి.నరేష్, రామిశెట్టి కళ్యాణ్, దేవా బత్తుల అరవింద్, కే.శ్రీను (పూల శ్రీను), దోసపర్తి రాజు, శానం ఉదయ్ సాయి, పండు నాయుడు, ఫణి, జనసేన నగర అధ్యక్షులు వీరంకి పండు, నాయకులు రెడ్డి గౌరీ శంకర్, సాయి రామ్ సింగ్, అల్లు చరణ్ తదితరులు పాల్గొన్నారు.