Ticker

6/recent/ticker-posts

శ్రీ గంగానమ్మ అమ్మవారి ఆశీస్సులతో ప్రజలంతా సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలి


ANDRAPRADESH, ELURU: శ్రీ గంగానమ్మ అమ్మవారి ఆశీస్సులతో ప్రజలంతా సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఏలూరు ఎంపి పుట్టా మహేష్‌ కుమార్‌, టిడిపి జిల్లా అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ఆకాంక్షించారు. ఏలూరు దక్షిణపు వీధి శ్రీ గంగానమ్మ, శ్రీ మహాలక్ష్మమ్మ, శ్రీ వినుకొండ అంకమ్మ, శ్రీ పోతురాజు బాబుల జాతర మహోత్సవంలో భాగంగా ఆదివారం మేడల్లో కొలువుదీరిన శ్రీ నల్ల మారెమ్మ అమ్మవారిని ఎంపి పుట్టా మహేష్‌, ఎమ్మెల్యే బడేటి చంటి, ఆర్టీసి విజయవాడ జోన్‌-2 చైర్మన్‌ రెడ్డి అప్పలనాయుడు దర్శించుకున్నారు. 


తొలుత వారికి ఆత్మీయ స్వాగతం లభించింది. అనంతరం అమ్మవారిని దర్శించుకున్న వారు,,, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపి పుట్టా, ఎమ్మెల్యే బడేటి మాట్లాడుతూ దక్షిణపు వీధిలో శ్రీ గంగానమ్మ అమ్మవారి జాతర మహోత్సవాన్ని కమిటీ సభ్యులంతా ఐక్యమై వైభవంగా నిర్వహించడం అభినందనీయమని ప్రశంసించారు. 

వారివెంట ఎఎంసి చైర్మన్‌ మామిళ్ళపల్లి పార్థసారధి, కార్పొరేటర్‌ కర్రి శ్రీనివాసరావు, మాజీ కార్పొరేటర్ కరణం గణేష్, డివిజన్ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ తవ్వా అరుణకుమారి, ఏలూరు సర్వజన సమ్మేళన దక్షిణపు వీధి జాతర కమిటీ గౌరవ అధ్యక్షులు చలువాది బ్రహ్మయ్య,జాతర కమిటీ అధ్యక్షులు అద్దేపల్లి వెంకటేశ్వరరావు, మరియు జాతర కమిటీ సభ్యులు, మరియు వివిధ డివిజన్లో ఇన్చార్జులు, కూటమి పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు