Ticker

6/recent/ticker-posts

కోర్టు మానిటరింగ్ సెల్ పనితీరుకు ఘనత – అధికారులను అభినందించిన జిల్లా ఎస్పీ


ఏలూరు: చింతలపూడి మహిళ హత్య కేసులో ముద్దాయికి జీవిత ఖైదు శిక్ష పడడంలో కోర్టు మానిటరింగ్ సెల్ కీలక పాత్ర పోషించిందని జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ ప్రశంసించారు. బాధితులకు న్యాయం చేకూర్చడంలో ఈ సెల్ సమర్థవంతంగా పనిచేస్తోందని ఆయన కొనియాడారు.


ఈ కేసులో అప్పటి చింతలపూడి ఇన్స్పెక్టర్, ప్రస్తుతం ఎస్‌బీ ఇన్స్పెక్టర్‌గా పనిచేస్తున్న ఎం.వి.ఎస్. మల్లేశ్వరరావు దర్యాప్తును పూర్తి చేసి ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. కోర్టు మానిటరింగ్ సెల్ అధికారులు సాక్షులను సకాలంలో కోర్టుకు హాజరుపరచి కేసు త్వరితగతిన పరిష్కారానికి సహకరించారు.

అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ చింతమనేని రమేష్ పటిష్టమైన వాదనలు వినిపించడంతో కేసు బలపడింది. అలాగే చింతలపూడి సీఐ క్రాంతికుమార్, సిఎంసి ఇన్స్పెక్టర్ ఎం. సుబ్బారావు, ఎస్ఐ సతీష్ కుమార్, హెడ్ కానిస్టేబుల్స్ ఎం. రాజేష్, ఎం. నాగేశ్వరరావు, ఎం. శ్రీనివాస్, బి. మల్లికార్జున రావు సాక్ష్యాల సేకరణలో కీలక పాత్ర పోషించారు.

ఈ కేసులో ప్రతిభ కనబరిచిన అధికారులు, సిబ్బందిని జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. నేరస్తులకు శిక్ష పడేలా చేయడం ద్వారా సమాజంలో శాంతి భద్రతలను కాపాడవచ్చని ఈ సందర్భంగా ఎస్పీ పేర్కొన్నారు.