ప్రజాసమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు : ఎమ్మెల్యే బడేటి చంటి
ఏలూరు, జనవరి 9: ఒకవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నామని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు. ప్రజాసమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు.
ఈ శుక్రవారం ఏలూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే బడేటి చంటి ఆయా సమస్యలపై సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి తక్షణ పరిష్కారానికి ఆదేశాలు జారీ చేశారు.
కొన్ని సమస్యలకు వెంటనే పరిష్కారం చూపాలని, మరికొన్ని అంశాలపై సత్వర చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కేవలం మాటలతో కాకుండా సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడమే తమ లక్ష్యమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో ఈడా చైర్మన్ పెద్దిబోయిన శివప్రసాద్, ఎఎంసి చైర్మన్ మామిళ్ళపల్లి పార్థసారధి, టెలికాం అడ్వైజరీ బోర్డ్ మెంబర్ లంకపల్లి మాణిక్యాలరావు, టిడిపి నగరాధ్యక్షులు చోడే వెంకటరత్నం, పార్టీ నాయకులు, క్లస్టర్, డివిజన్ ఇన్‌ఛార్జీలు తదితరులు పాల్గొన్నారు.


.jpeg)
