దెందులూరు: నియోజకవర్గంలో గ్రామాల అభివృద్ధి తో పాటు యువతకు ఉపాధి కల్పించే లక్ష్యంలో భాగంగా పారిశ్రామిక ప్రగతిక సైతం కృషి చేస్తున్నామని, సోమవరపాడు వద్ద ఎం.ఎస్.ఎం.ఈ పార్కు ఏర్పాటుకు సైతం ఇప్పటికే చర్యలు చేపట్టడం జరిగిందని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు.
పెదవేగి మండలం దుగ్గిరాలలోని క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఉదయం పలువురు నియోజకవర్గ కూటమి నాయకులు, అధికారులు, ప్రజలు, ప్రముఖులు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు, పలు ఆహ్వాన పత్రికలు అందించి శాలువాలతో సత్కరించారు..
ఇటీవల ఏలూరు జిల్లా ఏపీఎన్జీజీవోస్ నూతన అధ్యక్షా, కార్యదర్శులుగా ప్రమాణ స్వీకారం చేసిన చోడగిరి శ్రీనివాస్, నెరుసు రామారావు ఆధ్వర్యంలో నూతన కార్యవర్గం దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి మెమెంటోను అందజేశారు.. ఈ సందర్భంగా నూతన కార్యవర్గానికి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అభినందనలు తెలిపారు.. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు హరినాథ్ గారితో పాటు పలువురు ఏపీఎన్జీవో సంఘాల నాయకులు పాల్గొన్నారు.
అదేవిధంగా పలు గ్రామాల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులు స్వీకరించిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సత్వరమే వాటిని పరిష్కరించేలా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.


.jpeg)
