Ticker

6/recent/ticker-posts

జాతీయ బాలిక దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు అవగాహ


ఏలూరు జనవరి 24: రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ అమరావతి వారి ఆదేశాల ప్రకారం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ఈరోజు జాతీయ బాలిక దినోత్సవం సందర్భంగా స్థానిక సత్రంపాడు లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు విద్యార్థులకు అవగాహన కలిగించారు.


ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి క. రత్న ప్రసాద్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం జనవరి 24వ తేదీ బాలిక దినోత్సవం నిర్వహిస్తారని, సమాజంలో బాలికల సంరక్షణ, హక్కులు ఆరోగ్యము విద్య, సామాజిక అభివృద్ధి, గౌరవం మొదలైన అంశాల పైన సమీక్షించి, బాలికల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలు పైన ప్రణాళికను సిద్ధ చేసి వాటిని అమలుపరచడం, ఈ అంశాల పై బాలికలకు అవగాహన కలిగించటం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారని తెలియజేశారు. 

సమాజంలో బాలికలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ప్రజలకు తెలియజేసి, వారిని చైతన్యపరచి ఆ సమస్యల నుండి రక్షణ కలిగించడం, బాలిక శిశు సంరక్షణ, లింగ నిర్ధారణ పరీక్షలు నిరోధించడం వంటి చర్యలు తీసుకుంటారని, సమాజంలో బాలికల పట్ల వివక్షత దోపిడిని అరికట్టడానికి కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్ ట్రైనర్ పి.రత్నరాజు ప్యానల్ న్యాయవాది బి సంగీతరావు ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు సి.హెచ్. ఆంజనేయ వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.