ఏలూరు, జనవరి, 24 : స్ధానిక జిల్లా కలెక్టరేటు ప్రాంగణంలో ఉన్న ఎలక్ట్రానిక్ ఓటింగు మిషన్ల గోడౌన్ ను శనివారం జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి తనిఖీ చేశారు. ఈవియం గోడౌన్ వద్ద సిసి కెమేరాలతో ఏర్పాటు చేసిన భధ్రతా ఏర్పాట్లను ఈవియం యంత్రాలు బి.యులు, సియులు, వివిప్యాట్ లను, అక్కడి భధ్రతా ఏర్పాట్లను పరిశీలించారు.
కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు మేరకు ఈవీఎం గోడౌన్ తనిఖీలో భాగంగా ఈవియం గోడౌన్ కు వేసిన భధ్రతా సీళ్లు, సిసి కెమెరాలు పనితీరు, అగ్నిమాపక దళ పరికరాలు, మొదలైనవి పరిశీలించారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ భారతీయ ఎన్నికల సంఘం ఆదేశాలు మేరకు ఈవియం గోడౌన్ కు పటిష్ట భధ్రత కల్పించామన్నారు.
ఎప్పటి కప్పుడు గౌడౌన్ ను క్షుణంగా తనిఖీ చేసి ఎన్నికల సంఘానికి నివేదిక పంపిస్తున్నామన్నారు.. అనంతరం పరిశీలన రిజిస్టరులో జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి సంతకం చేశారు. ఈవియం గోడౌన్ వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీసు గార్డులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టరు ఆదేశించారు.
జిల్లా కలెక్టరు వెంట డిఆర్ ఓ వి. విశ్వేశ్వరరావు, జిల్లా కలెక్టరేటు సూపరింటెండెంటు కె.సి.హెచ్. చల్లన్నదొర,వివిధ పార్టీల ప్రతినిధులు, తదితరులు ఉన్నారు.


.jpeg)
