Ticker

6/recent/ticker-posts

జాతీయ బాలిక దినోత్సవ సంబరాలు 2026 కార్యక్రమంలో పాల్గొన్న జాయింట్ కలెక్టర్ డా.ఎం. జె. అభిషేక్ గౌడ


ఏలూరు, జనవరి, 24 : ఏలూరులోని శ్రీ  సురేష్  చంద్ర బహుగుణ పోలీస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు జిల్లా బాలల సంరక్షణ యూనిట్ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మరియు చైల్డ్ రైట్స్ అడోకాసి ఫౌండేషన్ వారి  ఆధ్వర్యంలో జాతీయ బాలిక దినోత్సవం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. 


ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన  జాయింట్ కలెక్టర్ డా.ఎం. జె. అభిషేక్ గౌడ  మాట్లాడుతూ ముందుగా కార్యక్రమంలో పాల్గొన్న బాలికలందరికి జాతీయ బాలిక దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తూ బాలికలు ఎదగడానికి కావాల్సినటువంటి సోపానాలు విద్యాభివృద్ధిలో బాలికలు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంలో మొదటి స్థానంలో ఉండాలన్నారు.  

నేటి సమాజంలో బాలికలకు విద్య,ఉద్యోగ అవకాశాలలో ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తున్నారని, . లింగ వివక్ష లేని సమాజాన్ని రూపొందించాలని అందుకొరకు మనందరం కలిసి పని చేయాలని ప్రభుత్వం కూడా బాలబాలికలందరికి సమాన అవకాశాలు కల్పిస్తూ అనేక పథకాలను అమలు చేస్తుందన్నారు.   
 . 
అడిషనల్ ఎస్పీ  ఎన్ సూర్య చంద్ర రావు మాట్లాడుతూ ఆనాటి కాలంలో మహిళలు ఎక్కువ శాతం కుటుంబ నేపథ్యాన్ని అభివృద్ధి పరుచుకుంటూ వచ్చేవారని,  అది రాను రాను మహిళలను అణచివేతకు గురయ్యేవారన్నారు.  మరల ప్రస్తుత రోజుల్లో బాలికలు ,మహిళలు అనేక రంగాలలో అభివృద్ధి చెందుతూ వారి  జీవనశైలి విధానాన్ని మెరుగుపరుచుకుంటున్నారని, బాలలందరూ ఉన్నత విద్యను అభ్యసించి అనేక రంగాలలో విజయాలు సాధించాలని బాలలకు సూచించారు.

మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్  శ్రీమతి పి.శారద మాట్లాడుతూ బాలికలకు బాలిక దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తూ బాలికలందరూ నేటి సమాజంలో విద్యపై ఆసక్తిని పెంచుకుని అన్ని రంగాలలో ఉన్నత స్థాయినీ అధిరోహించేలా అన్ని విషయాలలో నాయకత్వ లక్షణాలు అలవర్చుకొని ముందుకు వెళ్లాలని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా విద్యాశాఖ అధికారి  ఎమ్ . వెంకట లక్ష్మమ్మ, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ ఆర్ వి నాగరాణి జిల్లా బాలల సంరక్షణ అధికారి డాక్టర్ సిహెచ్ సూర్య చక్ర వేణి, నోడల్ ఆఫీసర్ ఈ .తులసి క్రాఫ్ స్టేట్ కోఆర్డినేటర్ సిహెచ్ ప్రభాకర్ జిల్లా కోఆర్డినేటర్ ఎస్ రవిబాబు ఆర్ వినోద్ కుమార్, తదితరులు పాల్గొన్నారు. 

కర్రసాము టీమ్ సౌజన్య, కరాటే దామిని సుధ టీమ్ , వివిధ రంగాల్లో ప్రతిభ కనపరచిన స్పోర్ట్స్, సోషల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్ హాస్టల్ లో ఉండి చదువుతూ అభివ్రుద్ది పథంలో ముందుకు వెళ్తున్న విద్యార్థులు కి ప్రశంస పత్రములు అందించారు.  పోలీస్ స్కూల్ బాలికలు , డి సి పి యు సిబ్బంది బాలస్వామి, మాధవి రాజేష్ తదితరులు పాల్గొన్నారు.