ఏలూరు: దృష్టి లోపం గల వారికి ప్రత్యేక “బ్రెయిలీ” లిపి ప్రధాత సర్ లూయీ బ్రెయిలీ 217వ జన్మదిన వేడుకలు ఏలూరు కలెక్టరేట్లోని గోదావరి సమావేశంలో శుక్రవారం ఘనంగా జరిగాయి. కార్యక్రమమునకు సంయుక్త కలక్టర్ డా. ఎం. జె.అభిషేక్ గౌడ ముఖ్య అతిధిగా హాజరయ్యారు.
కార్యక్రమమునకు ఏలూరు జిల్లా లోని దృష్టి లోపం కలిగిన దివ్యాంగులు దాదాపు 300 మంది ఈ వేడుకలకు హాజరు అగుట జరిగినది. సదరు కార్యక్రమము నందు దృష్టి లోపం కలిగిన దివ్యాంగులచే కేక్ కట్ చేయించారు. ఈ కార్యక్రమము నందు 20 మంది దృష్టి లోపం కలిగిన దివ్యాంగులకు వారి సేవలకు గుర్తింపుగా సన్మానము చేసి ప్రశంసాపత్రాలు అందజేశారు.
సదరు కార్యక్రమంలో విభిన్న ప్రతిభావంతుల, హిజ్రాల మరియు వయో వృద్దుల సంక్షేమ శాఖ ఏడి రం కుమార్, VCEA అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు జి.రవీంద్రబాబు , జి.డి.వి.ఎస్. వీర భద్ర రావు, గిడియన్, కుందేటి జయరాజ్ వివిధ సంఘాల వారు మరియు స్వచ్చంద సేవా సంస్థల తరపున పరివర్తన్ స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీనివాస రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బెయిలీ క్యాలెండర్ ని జేసి ఆవిష్కరించారు.


.jpeg)
