మిర్తిపాడు గ్రామంలో గోకులం షెడ్డు ప్రారంభించిన శాసన సభ్యులు శ్రీ బత్తుల బలరామ కృష్ణ
గోకులాల ద్వారా పాడి పరిశ్రమ మరింత అభివృద్ధి చెందాలి... ఎమ్మెల్యే బత్తుల
రాజానగరం/సీతానగరం: మండలం మిర్తిపాడు గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకం ద్వారా నిర్మించిన జొన్నలగడ్డ శ్రీనివాస్ గారి గోకులం షెడ్, గద్దె వీర ప్రభాకర్ గారి పశువుల షెడ్డు (గోకులం) ను ముందుగా కొబ్బరికాయ కొట్టి రిబ్బన్ కట్ చేసి రాజానగరం నియోజకవర్గం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ ప్రారంభించారు.
అనంతరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ రాజానగరం నియోజకవర్గంలో గోవుల సంక్రాంతి పండుగ ముందే వచ్చింది... ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబునాయుడు విజన్ తో, ఉపముఖ్యమంత్రివర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ ఆశయ సాధనలో రైతులందరికీ మేలు జరగాలి, అలాగే పాడి పంటలతో సమృద్ధిగా ఉండాలి, పల్లెలు పచ్చగా ఉండాలని తెలిపారు.
ఈ కార్యక్రమం పట్ల రైతులందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా పాడి పరిశ్రమ మరింత అభివృద్ధి చెందుతుందని, అలాగే రైతులకు ప్రభుత్వం అనేక ప్రోత్సాహకాలు అందిస్తున్నారని. ఇది మంచి ప్రభుత్వం అని రైతులు కొనియాడుతున్నారన్నారు. సంక్రాంతి మాకు ముందే వచ్చింది. గోకులం షెడ్ నిర్మాణంలో పశువులకు నీటి కుండీలు, దాణా తినడానికి సదుపాయాలు ఏర్పాటు చేసారని రైతులు పేర్కొన్నారన్నారు.
రాజానగరం నియోజకవర్గం వ్యవసాయ ఆధారిత ప్రాంతం కాబట్టి రైతులందరూ ఈ గోకులాల ద్వారా పాడి పరిశ్రమ ద్వారా అభివృద్ధి చెంది రానున్న రోజుల్లో ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలు, మేకలు పెంపకం ద్వారా రైతులందరూ మరింత ఆదాయం పొందాలని ఆశిస్తున్నానని ఈ సందర్భంగా తెలియజేసారు. గోకులాలను మంజూరు చేసిన ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి మరొక్క సరి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన, తెలుగుదేశం బిజెపి పార్టీ నాయకులు, కార్యకర్తలు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.


.jpeg)
