ANDRAPRADESH, ELURU: ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా సామరస్యపూరిత వాతావరణంలో అమ్మవార్ల జాతర మహోత్సవాలను నిర్వహించాలని, అనంతరం అమ్మవార్లను ఘనంగా సాగనంపాలని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి సూచించారు. జాతరల నిర్వహణకు అవసరమైన సహాయ సహకారాలను అందించే విషయంలో తానెప్పుడూ ముందుంటానని ఆయన భరోసా కల్పించారు.
దానిలో భాగంగా ఏలూరు నగరంలోని అన్ని జాతర కమిటీలకు ఒక్కొక్క కమిటీకి రూ.50 వేల చొప్పున మొత్తం రూ.4 లక్షల సొంత నిధులను ఎమ్మెల్యే బడేటి చంటి అందజేశారు. ఈ కార్యక్రమం సోమవారం ఏలూరులోని ఆయన క్యాంపు కార్యాలయంలో జరిగింది.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంటి బిజీబిజీగా గడిపారు. తన వద్దకు విచ్చేసిన ప్రజల నుంచి సమస్యలతో కూడిన వినతులను స్వీకరించి, వాటిని క్షుణ్ణంగా తెలుసుకున్నారు. కొన్ని సమస్యలకు అక్కడికక్కడే పరిష్కార చర్యలు చేపట్టగా, మరికొన్ని సమస్యలను సత్వరమే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
అదే సమయంలో ఏలూరు నగరంలోని వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న అమ్మవార్ల జాతరలను మరింత వైభవంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించాలన్న ఉద్దేశంతో అన్ని జాతర కమిటీలకు తన సొంత నిధుల నుంచి ఒక్కో కమిటీకి రూ.50 వేల చొప్పున మొత్తం రూ.4 లక్షలను ఆయా కమిటీ సభ్యులకు అందజేశారు.
సామరస్యపూరిత వాతావరణంలో అమ్మవారిని సాగనంపే కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా, దేదీప్యమానంగా నిర్వహించాలని జాతర కమిటీ సభ్యులందరికీ ఎమ్మెల్యే బడేటి చంటి ఈ సందర్భంగా సూచించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


.jpeg)
